పెద్ద నోట్లు రద్దు నిర్ణయం ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే వారికి కష్టాలు..
- November 09, 2016
పెద్ద నోట్లు రద్దు చేస్తూ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విదేశాల నుంచి వచ్చే వారికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోంది. విదేశాలనుంచి వచ్చి విమానం దిగగానే కార్డులో డబ్బున్నా తీసుకోలేని పరిస్థితి కొందరిదైతే.. చేతి నిండా విదేశీ కరెన్సీ ఉన్నా ఏమీ కొనలేని పరిస్థితి మరికొందరిది. ఏటీఎంలు మూతపడి.. ఫారెన్ ఎక్స్ఛేంజిల్లో డబ్బుల్లేక తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు.
ఒక శంషాబాద్ ఎయిర్‌పోర్టునే తీసుకుంటే.. ఈరోజు ఉదయం ఖతార్ .. దుబాయ్.. అబూదాబితో పాటు పలు దేశాల నుంచి వేలాది మంది ప్రయాణికులు హైదరాబాద్‌కు వచ్చారు. వీరిలో చాలా మంది హోటల్లోకి వెళ్తే పెద్ద నోట్లు చలామణి కాక..
ట్యాక్సీలకు డబ్బులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం.. ఏటీఎంలలో చూసినా డబ్బుల్లేని పరిస్థితి. అటు.. ఫారెన్ ఎక్సేంజీల్లో డబ్బు లభించక ఆందోళన చెందుతున్నారు. ఉదయాన్నే డెన్మార్క్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న శ్యామ్‌సుందర్ ఎదుర్కొన్న ఇబ్బందులను'ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగగానే రూ.500.. రూ. 1000 నోట్లు రద్దు చేసిన విషయం తెలిసింది. జేబులో విదేశీ కరెన్సీ ఉంది. కానీ.. ఫారెన్ ఎక్సేంజీకి వెళ్తే డబ్బు లేదన్నారు. ఏటీఎంకి వెళ్తే అక్కడా డబ్బు లేదు. ఏం చేయాలో తెలియక ఓ క్యాబ్ డ్రైవర్‌తో మాట్లాడి.. పెట్రోల్ బంక్‌కి వెళ్లా. అక్కడ డీజిల్ డబ్బులు కార్డ్‌తో చెల్లించి అదనంగా కొంత డబ్బు తీసుకున్నాను. వెయ్యి రూపాయలు అదనంగా తీసుకుంటే వంద రూపాయలు కమీషన్ తీసుకున్నారు. నాతో పాటు ఎయిర్‌పోర్ట్‌లో చాలామంది డబ్బుల్లేక.. తెలిసిన వారు రాక ఇబ్బందులు పడ్డారు' అంటూ విదేశాల నుంచి వచ్చే వారి కష్టాలు చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!







