ఒమన్‌లో ఇండియా కల్చరల్ ఫెస్టివల్
- November 09, 2016
ఐదు నెలలపాటు జరిగే ఇండియన్ ఫెస్టివల్, ఈ నెల నుంచే మస్కట్, సోహార్, సుల్ మరియు అల్ సలాహ్‌లలో ప్రారంభం కానుంది. అల్ బుస్తాన్ ప్యాలెస్‌లో నవంబర్ 15న రిట్స్ కార్ల్‌టన్ హోటల్‌లో 'ఫెస్టివల్ ఆఫ్ ఇండియా ఇన్ ఒమన్' పేరుతో ఈ ఈవెంట్ ప్రారంభోత్సవం జరగనుంది. ఇండియన్ ఎంబసీ, ఒమన్‌కి చెందిన హెరిటేజ్ అండ్ కల్చర్ మినిస్ట్రీ ఈ ఈవెంట్‌ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. సినిమాల ప్రదర్శన, ఫ్యాషన్ షోస్, మ్యూజికల్ నైట్, ఫుడ్ ఫెస్టివల్స్, ఇండియన్ బాలెట్ మరియు ఫక్షక్ డాన్సులు, ఇండియన్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్, మరియు ఇండియన్ కెలిగ్రఫీ ఎగ్జిబిషన్ వంటివి ఈ ఫెస్టివల్‌లో ప్రధాన ఆకర్షణలు కానున్నాయి. ఒమన్‌లో ఇండియా రాయబారి మని పాండే మాట్లాడుతూ, భారతీయ సంస్కృతీ సంప్రదాయాల గురించి మరింత గొప్పగా చాటిచెప్పేందుకే ఈ వేదిక ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఇరుదేశాల మధ్య సోషియో, ఎకనమిక్ రిలేషన్స్ బలపడేలా ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. భారతీయ సినీ రూపకర్తలకు ఒమన్‌లోని అద్భుతమైన లొకేషన్లు ఉపయోగపడ్తాయని ఆయన వివరించారు. ఏడాది కాలంలో ఇండియన్ ఎంబసీ, 95,000 వీసాలను ఒమనియన్లకు పర్యాటక రంగం పరంగా వీసాలు జారీ చేసినటుఉ్ల చెప్పారాయన.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







