భవనాలకు స్మార్ట్ మీటర్స్
- November 09, 2016
దోహా: కొత్త ప్రాజెక్టులు, మరియు బిల్డింగులు ఇకపై స్మార్ట్ ఎలక్ట్రిసిటీ మీటర్లను కలిగి ఉండనున్నాయి. పాత మీటర్లను కొత్త మీటర్లతో దశల వారీగా మార్చుతారు. ఖతార్ జనరల్ ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ కార్పొరేషన్ (కహ్‌రామా) అధికారి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. స్మార్ట్ మీటర్స్ ద్వారా మీటర్ రీడింగ్స్ ఎనర్జీ సప్లయర్‌కి ఖచ్చితత్వంతో అందిస్తాయని, వినియోగదారుకూ ఈ విధానం ద్వారా తాము వినియోగించే ఎనర్జీపై ఖచ్చితమైన సమాచారం ఉంటుందని ఆయన తెలిపారు. 15,000 మీటర్లను ఇప్పటికే సప్లయ్ చేసినట్లు ఆయన చెప్పారు. 2020 నాటికి 200 నుంచి 500 మెగా వాట్స్ సోలార్ ఎనర్జీని ఖతార్ తయారు చేయగలదని కరామా ప్రెసిడెంట్ ఇంగ్ ఇస్సా బిన్ హిలాల్ అల్ కువారి చెప్పారు. 2012లో ప్రారంభించిన తర్షీద్ ఎలక్ట్రిసిటీ కంజంప్షన్‌ని 14 శాతం వరకు తగ్గించిందనీ, వాటర్ కంజంప్షన్‌ని 15 శాతం తగ్గిందని ఆయన వివరించారు. వృధాని అరికట్టడం అలాగే ఖచ్చితత్వంతో కూడిన బిల్లులతో వినియోగదారులకు సేవలందించడం తమ లక్ష్యమని ఆయన అన్నారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







