`ఖైదీ నంబర్ 150` జెట్‌స్పీడ్‌తో చిత్రీకరణ..
- November 10, 2016
మెగాస్టార్ `ఖైదీ నంబర్ 150` జెట్‌స్పీడ్‌తో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి రిలీజ్ కోసం డెడ్‌లైన్‌తో టీమ్ అహోరాత్రులు శ్రమిస్తోంది. వి.వి.వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ కథానాయికగా నటిస్తున్నారు. . కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ పతాకంపై మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నిర్మిస్తున్నారు.ప్రీరిలీజ్ బిజినెస్‌లోనూ బాస్ అంతే స్పీడ్ చూపించడం సౌత్ ఇండస్ట్రీస్, ఓవర్సీస్‌లో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతం యూరప్‌లో పాటల చిత్రీకరణకు యూనిట్ రెడీ అవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత రామ్‌చరణ్ ఖైదీ నంబర్ 150 పాటల చిత్రీకరణకు యూరప్ వెళుతున్నట్టుగా తెలిపారు. స్లోవేనియా, క్రొయేషియా (సెంట్రల్ యూరప్) లాంటి అరుదైన దేశాల్లో రెండు పాటల్ని తెరకెక్కించనున్నారు.జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ ఈ పాటలకు కొరియోగ్రఫీ అందిస్తున్నారు. శ్రీమణి సాహిత్యం అందించారు. అన్ని పనులు పూర్తి చేసి, జనవరిలో సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ చేయనున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు తరుణ్ అరోరా విలన్ పాత్రలో నటిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డ్ గ్రహీత తోటతరణి కళాదర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







