జనవరి 20, 2017న కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ వైట్ హౌస్‌లో ప్రవేశిస్తారు..
- November 10, 2016
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్.. బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏం చేయబోతున్నారు? తొలి వంద రోజుల ప్రణాళిక ఎలా ఉండబోతోంది? అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ట్రంప్.. మొదట ఏ దేశంలో పర్యటిస్తారు? ఇప్పుడీ అంశాలన్నీ హాట్ టాపిక్ గా మారాయి. అమెరికా అధ్యక్ష చరిత్రలోనే చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా జనవరి 6న ట్రంప్ విజయాన్ని సెనేట్ అధ్యక్షుడు అధికారికంగా ప్రకటిస్తారు. జనవరి 20, 2017న కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ వైట్ హౌస్‌లో ప్రవేశిస్తారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ట్రంప్ ఏం చేస్తారు? తొలి వంద రోజుల ప్రణాళిక ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. మొదట ట్రంప్ తన కేబినెట్ ను ఏర్పాటు చేసుకుంటారు. విదేశాంగ, ఆర్థిక, రక్షణ మంత్రులతోపాటు కనీసం 15పదవులను భర్తీ చేస్తారు. అటార్నీ జనరల్‌ను నియమిస్తారు. అంతేకాకుండా ఒక సుప్రీంకోర్టు జడ్జీని ట్రంప్ నియమిస్తారు. ఫిబ్రవరిలో మరణించిన జడ్జీ ఆంటోనిన్ స్కేలియా స్థానంలో మరొకరిని కూడా నియమించాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్.. తాను నియమించబోయే జడ్జీ తుపాకీ హక్కులను సమర్థిస్తారని, గర్భస్రావం హక్కులను రద్దు చేస్తారని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సుప్రీంకోర్టు జడ్జీగా ఎవరిని నియమిస్తారన్ని ఆసక్తికరంగా మారింది.ట్రంప్ విదేశాంగ విధానం ఎలా ఉండబోతోందన్నది కీలకంగా మారింది. ముఖ్యంగా నాఫ్తాపై మళ్లీ సంప్రదింపులతోపాటు నాటో విధానంపైనా సమీక్ష జరపనున్నారు. అంతేకాకుండా ఐసిస్‌ను అంతమొందిస్తానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసిన ట్రంప్.. టెర్రరిజమ్‌పై ఎలాంటి స్టెప్ తీసుకుంటారన్నదానిపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. అంతేకాకుండా ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ఇతర హామీలపైనా ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. ముందుగా అమెరికన్లకే తొలి ప్రాధాన్యత ఉంటుందన్న ట్రంప్.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారన్నది తేలిపోనుంది. వలసల నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నేర చరిత్ర ఉండి.. అక్రమంగా వలస వచ్చిన వారిని స్వదేశానికి పంపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారన్నది కూడా ఉత్కంఠగా మారింది. ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఆయన మొదటిసారి ఏ దేశంలో పర్యటిస్తారన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ట్రంప్‌కు ముందున్న ఐదుగురు అమెరికా అధ్యక్షులు కూడా తొలిసారి మెక్సికో లేదా కెనడా దేశాలలో పర్యటించారు. మెక్సీకో సరిహద్దులో గోడ కడతానన్న ట్రంప్.. ఇప్పుడు ఆదేశంలోనే పర్యటిస్తారా? లేక కెడనాలోనా? ట్రంప్ ఏం చేస్తారన్నది చూడాలి.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







