న్యూ సౌక్ వకిఫ్ అండర్ గ్రౌండ్ పార్కింగ్ ప్రారంభం
- November 11, 2016
న్యూ అండర్ గ్రౌండ్ పార్కింగ్ కాంప్లెక్స్ - సౌక్ వకిఫ్లో నేటి నుంచి విజిటర్స్ కోసం ప్రారంభించబడింది. ఈ కాంప్లెక్స్‌లో వృద్ధులకు అలాగే ప్రత్యేకావసరాలుగలవారికి మొత్తం 650 వాహనాలకు పార్కింగ్ సౌకర్యం కల్పిస్తారు. మషీరెబ్ మరియు ఫాల్కన్ మార్కెట్ నుంచి ప్రవేశం అలాగే ఎగ్జిట్ ఈ పార్కింగ్ ఏరియాకి ఉంది. ఈ పార్కింగ్ ఏరియాకి పూర్తిస్థాయిలో భద్రత కల్పించారు. నిరంతరం సిసిటీవీ పర్కవేక్షణలో ఉంటుంది ఈ పార్కింగ్. ఇందులో ఐదు సినిమా థియేటర్లున్నాయి. వచ్చే ఏడాది ఇవి ప్రారంభమవుతాయి. సౌక్ వకిఫ్ నుంచి మొత్తం 38 స్టోర్స్ ఈ బిల్డింగ్‌లో ఏర్పాటు చేశారు. 12 ఆటోమేటెడ్ పేమెంట్ డివైజెస్‌ని పార్కింగ్ ఫీజుల చెల్లింపు కోసం ఏర్పాటు చేయడం జరిగింది. 10 ఎలివేటర్లు ఇందులో ఉండగా, వాటిల్లో 2 సినిమా ప్రాంతం కోసం ఏర్పాటు చేశారు. 9 ఎమర్జన్సీ ఎంట్రన్స్ మరియు ఎగ్జిట్స్ కూడా ఉన్నాయి. గంట సమయానికి మినిమమ్ 3 ఖతారీ రియాల్స్ పార్కింగ్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. భద్రతా కారణాల రీత్యా 24 గంటల కంటే ఎక్కువగా ఇక్కడ పార్కింగ్‌కి అనుమతించరు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







