విచారణలో శాండిల్‌వుడ్ విషాదం
- November 11, 2016
శాండిల్‌వుడ్‌లో స్టంట్ మాస్టర్ల మృతితో ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. రిజర్వాయర్ నుంచి రెండో మృతదేహాన్ని బయటకు తీశారు. మరోవైపు ఈ ఘటనపై క్రిమినల్ కేసు నమోదుకాగా... కర్ణాటక ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది. ఇటు ఫిల్మ్ చాంబర్ కూడా ఈ ప్రమాదంపై స్పందించింది. నిర్లక్ష్యంగా వ్యవహరించినవారిపై చర్యలు తప్పవని ప్రకటించింది.
షూటింగ్ సమయంలో ప్రాణాలు కోల్పోయిన స్టంట్ మాస్టర్ల మృతితో శాండిల్‌వుడ్‌లో విషాదం నెలకొంది. అనుకోని ప్రమాదంతో ఇద్దరు చనిపోవడంతో ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగింది.
రిజర్వాయర్‌లో కనిపించకుండా పోయిన అనిల్ డెడ్‌బాడీ కూడా దొరికింది. గజ ఈతగాళ్ల సాయంతో బయటకు తీశారు. అతడి మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వారి సొంత ఊళ్లలో అనిల్, ఉదయ్‌ల అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి.
ఈ ఘటనను కర్ణాటక ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. ముమ్మాటికీ ఈ సంఘటన నిర్లక్ష్యమేనన్న సీఎం సిద్దరామయ్య విచారణకు ఆదేశించారు. ఇటు పోలీసులు కూడా నిర్మాత, డైరెక్టర్, స్టంట్ మాస్టర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఫిల్మ్ చాంబర్ కూడా ప్రమాదంపై స్పందించింది. నిర్లక్ష్యంతోనే ఇద్దరి ప్రాణాలు పోయాయని... రెండు మూడు రోజుల్లో సమావేశం ఏర్పాటు చేసి దీనికి బాధ్యులైనవారిపై కఠినచర్యలు తీసుకొంటామని ప్రకటించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







