'ఇమేజ్' టవర్ల ఫస్ట్ లుక్ను విడుదల చేసిన కేటీఆర్
- November 11, 2016
త్వరలో హైదరాబాద్లో నిర్మించబోయే 'ఇమేజ్' టవర్ల ఫస్ట్ లుక్ను తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె. తారకరామారావు విడుదల చేశారు. హైదరాబాద్లో నిర్వహిస్తున్న నాస్కామ్ గేమ్ డెవలపర్ల సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన ఈ నమూనాను ఆవిష్కరించారు. సరికొత్త, అత్యాధునిక డిజైన్లో ఈ టవర్లను నిర్మించడానికి తలపెట్టినట్లు తెలుస్తోంది.
ఇందులో ఇమేజ్ అంటే.. ఇన్నోవేషన్ ఇన్న మల్టీమీడియా, యానిమేషన్, గేమింగ్ అండ్ ఎంటర్టైన్మెంట్ అని కేటీఆర్ ఒక ట్వీట్లో వివరించారు. నాలుగు వైపులా నాలుగు టవర్లతో పాటు.. పై భాగంలో వాటన్నింటినీ కలుపుతూ ఈ నిర్మాణం కనిపిస్తోంది. టవర్ల మధ్యభాగంలో కూడా పెద్ద పరిమాణంలో ఉండే టీవీ స్క్రీన్లు సైతం మోడల్లో కనిపిస్తున్నాయి.
కింది భాగంలో రెండు స్విమ్మింగ్ పూల్స్ కూడా డిజైన్లో భాగంగా ఉన్నాయి. ప్రధానంగా మల్టీమీడియా, గేమింగ్ పరిశ్రమను దృష్టిలో పెట్టకుని ఈ టవర్స్ నిర్మాణం చేపట్టబోతున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







