విమానంలో బాంబు ఉందని బెదిరించిన భారతీయుడు
- November 11, 2016
ఎక్కాల్సిన విమానం ఎక్కడ మిస్ అవుతుందోనని భారత్‌కు చెందిన ఓ వ్యక్తి విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరించాడు. తెలివికి జోహార్లంటూ కటకటాల వెనక్కు పంపించారు అధికారులు. ఆరు నెలల జైలు శిక్షతో పాటు, 34 లక్షల జరిమానా కూడా విధించారు. వివరాల్లోకి వెళితే.. స్విట్జర్లాండ్ మోంట్రాక్స్లో నివాసం ఉంటున్న 39 ఏళ్ళ భారతీయుడు మాస్కోకి చెందిన విమానంలో ప్రయాణించాల్సి ఉంది. ఏదో కారణం వల్ల విమానాశ్రయానికి రావడం లేటయింది. ఎక్కడ విమానం వెళ్ళపోతుందోనని భయపడి విమానంలో బాంబు ఉందంటూ ఫోన్ చేశాడు. సమాచారం అందుకున్న సిబ్బంది 116 మంది ప్రయాణీకులు ఉన్న ఆ విమానాన్ని ఆపి క్షుణ్ణంగా పరిశీలించారు. విమానంలో ఎటువంటి అనుమానిత వస్తువులు లభ్యం కాకపోవడంతో అది బెదిరింపు కాల్ అని భావించి విచారణ జరిపారు. విచారణంలో భారతీయుని సమాధానం విని ఖంగుతిన్నారు. అందుకే భారీ జరిమానా విధించారు. బెదిరింపు కాల్ రాగానే హుటాహుటిన విమానాశ్రయానికి చేరుకున్న 101 పోలీసు అధికారులకు, ఆరుగురు పబ్లిక్ సెక్యూరిటీ ఏజెంట్లకు అతడు కట్టే జరిమానాను ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రయాణీకుల భద్రత తమ బాధ్యత అని, ఇటువంటి బెదిరింపు కాల్స్ చేసే వారిని విడిచిపెట్టబోమని పోలీసులు వెల్లడించారు.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







