నాగ్ తో సినిమా తీయనున్న చందు
- November 11, 2016
న్యూటాలెంట్‌ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు నాగార్జున. అందుకే టాలీవుడ్‌లో డైరెక్టర్ కావాలని ఆశపడే వాళ్లదృష్టి ముందుపడేది నాగార్జున మీదే! నాగ చైతన్య రీసెంట్‌గా హిట్ కొట్టిన 'ప్రేమమ్' డైరెక్టర్ చందూ మొండేటి, ఎప్పుడో నాగార్జున కోసం ఓ స్టోరీ రెడీ చేశాడు. కానీ అనుకోకుండా నిఖిల్ హీరోగా 'కార్తికేయ'మూవీతో డైరెక్టర్ అయ్యాడు. ఆ సినిమా హిట్ కావడంతో ఇక నెక్స్ట్ నాగ్‌తో చేయాలని ప్లాన్ చేశాడు. ఈలోగా చందూ టాలెంట్ నచ్చిన నాగ్, ప్రేమమ్ రీమేక్ చేయమని ఆఫర్ ఇచ్చాడు.
ఇప్పుడు ఎన్‌టీఆర్, రవితేజ, వరుణ్ తేజ్ లాంటి హీరోలతో సినిమాలు చేయడానికి చర్చలు జరిపాడట ఈ దర్శకుడు. కానీ తన థర్డ్ మూవీ నాగార్జునతో చేయబోతున్నాడని సమాచారం.
రీసెంట్‌గా చందూ తనవద్దనున్న స్టోరీని ఈ హీరోకి చెప్పడం, మన్మధుడికి నచ్చేయడం అంతా జరిగిపోయిందని టాక్. ఇందులో పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడట. మొత్తానికి చాలాగ్యాప్ తర్వాత మళ్ళీ పోలీస్ గెటప్‌లో కనిపిస్తాడట నాగ్. వాసుదేవరెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రం త్వరలో ప్రారంభంకానుందని సమాచారం.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







