యూఏఈ ఇండియన్ బ్యాంక్స్ లో పాత నోట్లకు 'నో'
- November 12, 2016
భారతదేశంలో 500, 1000 రూపాయల పాత నోట్లు రద్దు కావడంతో, పాత నోట్లను మార్చుకునేందుకు బ్యాంకుల వద్ద బారులు తీరారు. అలాగే యూఏఈలోని భారతీయులు తమ వద్దనున్న పాత కరెన్సీని మార్చుకునేందుకు బ్యాంకులకు వెళుతున్నారు. అయితే కొన్ని బ్యాంకులు పాత నోట్లను అంగీకరించడంలేదు. దీనిపై సోషల్ మీడియాలో పలు వదంతులు స్ప్రెడ్ అవుతున్నాయి. వీటిపై స్పందించిన చార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ పంకజ్ ముంద్రా మాట్లాడుతూ ఆ మెసేజ్‌ని ఫేక్‌గా తేల్చారు. యూఏఈలో కేవలం బ్యాంక్ ఆఫ్ బరోడా మాత్రమే యూఏఈలోని ఇండియన్ బ్యాంక్ అనీ, దీనికి మాత్రమే పూర్తిస్థాయిలో అన్ని అనుమతులూ ఉన్నాయనీ, ఇక్కడ మాత్రమే పాత నోట్ల ఎక్స్ఛేంజ్కి అనుమతి ఉందని తెలిపారు. ఇంకో వైపున ఈ బ్యాంకుకి భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అందలేదు. భారతదేశం వెలుపల ఉన్న బ్యాంకులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ అందలేదని ముంద్రా తెలిపారు. 500, 1000 నోట్ల రద్దు వ్యవహారం విదేశాల్లోని భారతీయుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వివిధ పనుల నిమిత్తం విదేశాలకు వెళ్ళి వచ్చినవారు, పరిస్థితిని తెలుసుకుని షాక్‌కి గురవుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో పార్కింగ్ సమస్యకు పరిష్కారం..!!
- దుబాయ్ పోలీసుల నిజాయితీకి ప్రశంసలు..!!
- సౌదీ అరేబియాలో భారీ తనిఖీలు..!!
- ఒంటెల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు.. 12 మంది ప్రముఖులకు తుంబే గ్రూప్ సత్కారం
- తెలంగాణ ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్, కేసీఆర్
- యూఏఈలో విద్యా సంస్థల స్థాపకుడు భారతీయ ఎన్ఆర్ఐ కన్నుమూత
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!







