నేను ఓడిపోవటానికి అతనే కారణం : హిల్లరీ క్లింటన్
- November 13, 2016
తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమే అని డెమోక్రటిక్ పార్టీ అభ్యర్ధి హిల్లరీ క్లింటన్ ఆరోపించారు. ఈ-మెయిల్స్ విషయంలో ఎఫ్‌బీఐ తిరిగి విచారణ జరపడంతో తాను అధ్యక్ష పదవి కోల్పోయానని.. చెప్పాలంటే ఇలాంటి కారణాలు చాలా ఉన్నాయని హిల్లరీ పేర్కొన్నారు. రిపబ్లికన్లకు మద్దతుగా ఉన్న అరిజోనా రాష్ట్రం కూడా డెమోక్రటిక్ పార్టీకే సపోర్ట్ చేసిందని, అదే సమయంలో జేమ్స్ కోమే తన ఈ-మెయిల్ కేసును పునఃవిచారణ చేపట్టి తనకు క్లీన్‌చిట్ ఇవ్వడంతో అంతా గందరగోళంగా మారిపోయిందన్నారు. ఈ ఒక్క కారణంతోనే అరిజోనా రాష్ట్రం తమ చేతి నుంచి జారిపోయిందని అన్నారు.
హిల్లరీ అమెరికా స్టేట్ సెక్రటరీగా ఉన్నప్పుడు వ్యక్తిగత ఈ-మెయిల్స్ చేసినట్లు ఆమెపై ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్‌కు రెండ్రోజుల ముందు ఈ-మెయిల్ కుంభకోణం విషయంలో ఎఫ్‌బీఐ హిల్లరీకి క్లీన్‌చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!







