పాక్ ఆత్మాహుతిదాడిలో 52కి చేరిన మృతుల సంఖ్య
- November 13, 2016
పాకిస్థాన్‌లో ఇస్లామిక్ స్టేట్ బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో శనివారం జరిగిన ఆత్మాహతి దాడిలో మృతుల సంఖ్య 52కి చేరుకుంది. లాస్బెలా జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న సురాని దర్గా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పద్నాళ్లుగేళ్ల బాలుడు ఈ దారుణానికి పాల్పడినట్లు అధికారులు భావిస్తున్నారు. దర్గాలో రోజువారీగా సాయంత్రం నిర్వహించే సంప్రదాయ నృత్య కార్యక్రమం జరుగుతుండగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువ మంది చిన్నారులు, మహిళలు ఉన్నారని బలూచిస్థాన్ హోంమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ తెలిపారు. పేలుడు సంభవించిన సమయానికి దర్గాలో దాదాపు 600 మంది ఉన్నట్లు అధికారులు చెపుతున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







