చిల్డ్రన్స్ డే సందర్భగా 'తారాజువ్వలు' టీజర్ విడుదల
- November 14, 2016
హెచ్.వై. ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దర్శకుడు మహేష్ కత్తి డైరెక్షన్‌లో నాగమల్లా రెడ్డి నిర్మాతగా రూపొందుతున్న చిత్రం `తారాజువ్వలు`. ఈ సినిమా టీజర్‌ను చిల్డ్రన్స్ డే రోజున టీజర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ కత్తి మాట్లాడుతూ - ``నా గురువు, మెంటర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి, చిత్ర నిర్మాత నాగమల్ల రెడ్డి ఇరగంలకు ముందుగా నా కృతజ్ఞతలు. `తారాజువ్వలు` సినిమా విషయంలో వీరిందిస్తున్న సహకారం మరువలేనిది. ఈ చిల్డ్రన్స్ డే సందర్భంగా తారాజువ్వలు టీజర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రానికి రఘునాథ్ ఎడిటింగ్ వర్క్, వినోద్ రాజేంద్రన్ సినిమాటోగ్రఫీ, ఘంటశాల విశ్వనాథ్ సంగీతంను అందిస్తున్నారు. నా కోడైరెక్టర్ కార్తీక్ మేడికొండ, నా డిజైనర్ నిహారిక రెడ్డిల సహకారం మరువలేను. అలాగే ఈ చిత్రానికి భాస్కరభట్ల రవికుమార్, శ్రేష్ఠ అద్భుతమైన సాహిత్యానందించారు`` అన్నారు.
చిత్రంలో అజయ్ ఘోష్,విశ్వనాథ్, సౌమ్య వేణుగోపాల్, కోమల, కార్తీక్, సాత్విక్, శ్రీమాధవి చంద్ర కూచిబొట్ల, సురేష్ లొలిత్ కుమార్, స్వప్న, సుజాత సహా పలువరు బాలనటీనటులు ఈ చిత్రంలో నటిస్తున్నారు
తాజా వార్తలు
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!
- యూఏఈ లాటరీలో భారతీయుడికి Dh5 మిలియన్ల జాక్‌పాట్..!!
- క్యాబిన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటుకు జీఎంఆర్ ఏరో టెక్నిక్ ఒప్పందం
- మహారాష్ట్ర హైరైజ్ బిల్డింగ్‌లో అగ్నిప్రమాదం..ఇద్దరు మహిళలు సజీవదహనం
- ఏపీ మహిళా కమిషన్ సభ్యురాలిగా గౌతమి శ్వేత







