డిసెంబర్ లో మోహన్ లాల్ 'మన్యం పులి'
- November 15, 2016
మల్లూవుడ్ మెగాస్టార్ మోహన్ లాల్ నటించిన తాజా సినిమా పులిమురుగన్ రికార్డుల పరంపర కొనసాగుతోంది. ఇప్పటికే మళయాల సీమలో భారీ కలెక్షన్స్ తో గత రికార్డులు అన్నింటిని బ్రేక్ చేసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా అదే జోరున కొనసాగతోంది. ఇప్పటివరకు 100 కోట్లకి పైగా వసూళ్ల రాబట్టి మల్లూవుడ్ లోనే కాదు మోహన్ లాల్ కెరీర్ లో సైతం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది పులిమురుగన్. ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ సర్వసతి ఫిల్మ్స్ పతాకం పై ప్రముఖనిర్మాత సింధూరపువ్వు కృష్ణారెడ్డి 'మన్యం పులి' పేరిట విడుదల చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే నవంబర్ 25న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను ప్రస్తుత పరిస్థితుల రిత్య వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత తెలిపారు. అలానే డిసెంబర్ నెలలో మరో విడుదల తేదీని ఫిక్స్ చేసి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చేందుకు కృష్ణారెడ్డి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్స్ అందుకుంటోన్న ‘మన్యం పులి’ తెలుగులో సైతం సెంట్ పర్సెంట్ సక్సెస్ అందుకునే అవకాశం ఉందని టాలీవుడ్ ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. .దాదాపు రెండు సంవత్సరాలు పాటు ఈ సినిమాను కేరళ, వియత్నాం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. పీటర్ హేన్స్కంపోజ్ చేసిన ఫైట్స్ ఈ సినిమాకు మెయిన్ హైలెట్ గా నిలుస్తాయని, చిత్ర బృందం తెలిపింది. జగపతి బాబు, కమలినీముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు, కథ : ఉదయ కృష్ణ, సంగీతం : గోపీసుందర్, కెమెరా : షాజీ కుమార్
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







