గుర్తింపు కార్డు చాలు ఆసుపత్రిలో చికిత్స కోసం...
- November 15, 2016
:ఆధార్ కార్డుతో రండి ఆపరేషన్ చేసుకొండి .డబ్బులు లేకున్నా ఫర్వాలేదు అంటూ గుంటూరుకు చెందిన ఓ డాక్టర్ అత్యవసర శస్త్రచికిత్స నిర్వహిస్తున్నాడు. పెద్ద నగదు నోట్లను రద్దుచేయడంతో అత్యవసర శస్త్రచికిత్స అవసరమైనవారికి డబ్బుల కోసం ఇబ్బందిపెట్టకుండా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం పెద్ద నగదు నోట్లను రద్దు చేయాలని నిర్ణయం తీసుకోవడంతో అత్యవసర శస్త్రచికిత్సలు అవసరమైన వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని అర్థంచేసుకొన్న గుంటూరుకు చెందిన డాక్టర్ డబ్బుల కోసం రోగులను ఇబ్బందులు పెట్టకుండా శస్త్రచికిత్సలునిర్వహిస్తున్నాడు.గుంటూరుకు చెందిన ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ నరేంద్రరెడ్డి ఆధార్ కార్డుతో వచ్చిన వారికి ఆపరేషన్ చేస్తానని ప్రకటించారు.
ఆపరేషన్ పూర్తైన తర్వాత డబ్బులు చెల్లించవచ్చని ఆయన సూచించారు. ఈ సౌకర్యాన్ని ఈ ఏడాది డిసెంబర్ 30వ, తేది వరకు కొనసాగిస్తామన్నారు.
గుర్తింపు కార్డు చాలు
ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే రోగుల వద్ద రద్దు చేసిన నగదు నోట్లు మాత్రమే ఉంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని డాక్టర్ చెబుతున్నారు. అవుట్ పేషేంట్, ఇన్ పెషేంట్ విభాగాల్లో రోగులు చికిత్స కోసం తమ గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలని కోరారు. గుర్తింపు కార్డుల ఆధారంగా చికిత్సి నిర్వహిస్తామని తర్వాత పీజు చెల్లించవచ్చని ఆయన సూచించారు. ఆన్ లైన్ ద్వారా ఆసుపత్రి పీజులు చెల్లించేందుకు అవకాశం కల్పించారు. డెబిట్, క్రెడిట్ కార్డులతో పాటు చెక్ ల ద్వారా కూడ పీజును చెల్లించే అవకాశం ఉందన్నారు.ఆన్ లైన్ తో పాటు ఆసుపత్రిలో ఫీజు చెల్లించే పద్దతులు రోగి వద్ద లేని సందర్భంలో తన గుర్తింపు కార్డును తెచ్చుకొని సేవలను పొందవచ్చని ఆయన సూచించారు.ఓపి సేవలకు ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేదని ఆయన సూచించారు. తమ వద్ద డబ్బులు వచ్చిన తర్వాతే ఆసుపత్రి పీజులు చెల్లించాలని ఆయన సూచించారు.
తాజా వార్తలు
- కేరళ: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి..
- లండన్‌లోని ప్రముఖ రెస్టారెంట్లో షేక్ మొహమ్మద్ సందడి..
- బాక్సింగ్‌లో ఏకంగా 7 స్వర్ణాలు సాధించిన భారత్!
- జలీబ్లో ఉక్కుపాదం.. 1,253 మంది అరెస్ట్..!!
- ఒమాన్‌లో ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిన కీలక మార్పులు..!!
- అమెరికాలో సౌదీ రక్షణ శాఖ సహాయ మంత్రి..కీలక చర్చలు..!!
- ఘనంగా ప్రారంభమైన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు..
- నిబంధనల ఉల్లంఘన.. ట్రావెల్ ఏజెన్సీ మూసివేత..!!
- యూఏఈలో ఈ ఏడాది తొలిసారి 50°C నమోదు..!!
- ఆరు రోజుల్లోనే 38 వేల మంది సందర్శకులు..విశేష ఆదరణ..!!







