1 ఒమన్ రియాల్ = 200 రూపాయలు
- November 15, 2016
ఒమన్‌లోని కొన్ని మనీ ఎక్స్‌ఛేంజెస్, 1 ఒమన్ రియాల్‌ని 200 రూపాయలకి, 201 రూపాయలకీ విక్రయిస్తున్నాయి. భారత ప్రభుత్వం రద్దు చేసిన 500, 1000 రూపాయల్ని మార్చుకునేందుకు ఇది తాము ప్రకటించిన బంపర్ ఆఫర్ అని ఆ సంస్థల ప్రతినిథులు అంటున్నారు. ప్రస్తుత ఎక్స్‌ఛేంజ్ రేట్ ప్రకారం 1 ఒమన్ రియాల్ ధర 176.32 గా ఉంది. డిసెంబర్ 30లోపు భారతదేశానికి వెళ్ళాలనుకునేవారికి ఇది స్పెషల్ రేట్ అని మనీ ఎక్స్‌ఛేంజ్ ప్రతినిథి ఒకరు తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గైడ్‌లైన్స్ ప్రకారం భారతీయ వలసదారులు 25,000 రూపాయల క్యాష్‌ని తమతో తీసుకెళ్ళవచ్చు. కాబట్టి డిసెంబర్ 30 లోపు భారతదేశానికి వెళ్ళాలనకునేవారు ఈ ఆఫర్‌ని వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ రెండు మనీ ఎక్స్‌ఛేంజ్ సంస్థలూ తమ వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల రూపంలో ఈ ఆఫర్ వివరాల్ని తెలియజేస్తున్నాయి.
తాజా వార్తలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ







