కమల్ని కలిసిన రజనీ
- November 15, 2016
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తన చిరకాల మిత్రుడు, సీనియర్ నటుడు ఉలగనాయగన్ కమల్‌హాసన్‌తో సోమవారం రాత్రి హఠాత్తుగా భేటీ అయ్యారు. స్థానిక ఆళ్వార్‌పేటలో ఉన్న తన నివాసానికి వచ్చిన రజనీకి కమల్ ఇంటి గుమ్మం వద్దే నిలబడి సాదర స్వాగతం పలికారు. మలేషియాలో కబాలీ చిత్రం షూటింగ్ పూర్తయిన తర్వాత రజనీకాంత అస్వస్థతకు గురై చికిత్స తర్వాత కోలుకున్నారు. ఇక కమల్‌హాసన్ సైతం అమెరికాలో 'శభాష్‌నాయుడు' చిత్రం షూటింగ్లో పాల్గొని స్వదేశానికి తిరిగొచ్చి తన కార్యాలయం మెట్లెక్కుతూ జారిపడ్డారు. ఈ ప్రమాదంలో కాలి ఎముక దెబ్బతిని ఆపరేషన్ చేసుకున్నారు. రజనీకాంత్ ప్రస్తుతం '2.0' చిత్రం షూటింగ్లో బిజీగా ఉండగా, కమల్‌హాసన్ శబాష్‌నాయుడు షూటింగ్లో పాల్గొనేందుకు సమాయత్తమవుతున్నారు.ఇరువురూ అనారోగ్యంపాలై కోలుకున్న తర్వాత సీని ఫంక్షన్లలో ఇరువురూ పాల్గొనలేదు. ఈ పరిస్థితులలో రజనీకాంత్, కమల్ హాసన్‌ను కలుసుకుని పరామర్శించారు. ఇరువురూ ఒకరి ఆరోగ్యం గురించి మరొకరు అడిగి తెలుసుకున్నారు. సమాచారం. చాలా గ్యాప్ తర్వాత కలుసుకోవడంతో ఇరువురూ తీవ్ర ఉద్వేగానికి గురైనట్లు సమాచారం.
'తూంగావనం' దర్శకుడు, ప్రస్తుతం కమల్‌హాసన్ సహాయకుడిగా ఉంటున్న రాజేష్ ఎం.సెల్వా ఆ ఇరువురితో నిలబడి తీసుకున్న ఫోటో ఫేస్బుక్లో వెలువడంతో కమల్, రజనీ రహస్య భేటీ వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







