ఆసుపత్రి నిర్మాణ స్థలం తగ్గింపు
- November 15, 2016
కువైట్: మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, ఆసుపత్రి నిర్మాణ స్థలాల తగ్గింపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తగినంత స్థలం లభ్యం కాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని ప్రైవేట్ మెడికల్ సర్వీసెస్ అసిస్టెంట్ అండర్ సెక్రెటరీ డాక్టర్ మొహమ్మోద్ అల్ క్షస్తి చెప్పారు. ఒమూమా హాస్పిటల్ 6వ వార్షికోత్సవ వేడుకల్లో ఖస్తి ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త ఆసుపత్రుల నిర్మాణం కోసం పలువురు ఇప్పటికే లైసెన్సులు పొందినట్లు తెలిపారాయన. ఒమూమా హాస్పిటల్ ఫౌండర్ మరియు సూపర్వైజర్ అలియా ఫైసల్ అల్ ఖాలెద్ మాట్లాడుతూ, తమ ఆసుపత్రి 2010లో ప్రారంభమైనప్పటినుంచీ చాలా చాలెంజెస్‌ని ఎదుర్కొందనీ, నైపుణ్యం కలిగిన మెడికల్ అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్‌ని హైర్ చేసుకోవడం కష్టతరంగా మారిందని అన్నారు. హాస్పిటల్ సీఈఓ డాక్టర్ సయీద్ రతెబ్ మాట్లాడుతూ, తమ ఆసుపత్రిలో కొత్త వింగ్స్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నాయన్నారు. తమ ఆసుపత్రి 330,000 మంది రోగుల్ని ఇప్పటిదాకా రిసీవ్ చేసుకున్నట్లు చెప్పారాయన.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







