దుబాయ్ నుండి హైదరాబాద్ కు చేరుకున్నఅతిపెద్ద జాతీయ జెండా
- November 15, 2016
మహా నగరాభివృద్ధి సంస్థ(హెచ్ఎండీఏ)పై సంజీవయ్య పార్కులోని అతిపెద్ద జాతీయ పతాక నిర్వహణ భారం ఇకపై తగ్గనుంది. బలమైన గాలుల్ని తట్టుకునేలా రూపొందించిన ట్రిపుల్యాన్ యూవీ కోటెడ్ తిరంగా పార్కులో త్వరలో రెపరెపలాడబోతోంది. హుస్సేన్‌సాగర్ పరిసరాలకు సరికొత్త అందాలను తీసుకురానుంది.
రూ.3.15 లక్షలతో ప్రత్యేకంగా తయారు చేయించిన ఆ కొత్త జాతీయ జెండా ఇప్పటికే దుబాయి నుంచి నగరానికి చేరింది.
దేశంలోని కొన్ని నగరాల్లో ఉన్నట్లుగా మన నగరంలోనూ అతి పెద్ద జాతీయ జెండాను సంజీవయ్య పార్కులో ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నిర్వహణ బాధ్యతను హెచ్ఎండీఏ చూస్తోంది.
భారం.. భారం.. అసలే అప్పుల వూబిలో ఉన్న హెచ్ఎండీఏకు జెండా నిర్వహణ ఆర్థికంగా భారంగా మారింది. బలమైన గాలులు వీస్తుండడంతో తరచూ జెండా చిరిగిపోతోంది. కొద్ది కాలానికే రంగులూ వెలిసిపోతున్నాయి. ఫలితంగా ప్రతి నెలా రెండు జెండాలు అవసరమవుతున్నాయి. ఒక్కో జెండా కోసం రూ.1.5 లక్షలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇక విద్యుత్ ఛార్జీలు, డీజిల్ జనరేటర్ నిర్వహణ, జెండాను ఎత్తడానికి దించడానికి సిబ్బంది, రక్షణ... ఇలా అన్నీ కలిపి నెలకు రూ.3.5 లక్షల వరకు వ్యయమవుతోంది. అంటే ఏడాదికి సుమారు రూ.40 లక్షలకు పైగా అన్నమాట. ఈ నేపథ్యంలో దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన భారీ జెండాల నిర్వహణ ఎలా ఉందో హెచ్ఎండీఏ అధికారుల బృందం కొద్ది నెలల కిందట అధ్యయనం చేసింది. అనంతరం రంగులు వెలిసి పోకుండా, బలమైన గాలులకు తట్టుకునేలా ట్రిపుల్యాన్ వస్త్రంతో జెండాను ప్రత్యేకంగా తయారు చేయించాలని అధికారులు నిర్ణయించారు. ఇదే రకమైన జెండాను రాంచీలోనూ వినియోగిస్తున్నారు. రాంచీలోని భారీ జాతీయ జెండాను తయారు చేసిన దుబాయ్‌కి చెందిన ఛానల్ గ్రూప్‌తో హెచ్ఎండీఏ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కో జెండా ఖరీదు రవాణా ఖర్చులు కలుపుకొని రూ.3.15 లక్షలవుతుంది. మూడు నెలలలోపు ఏం జరిగినా ఛానల్ గ్రూప్‌దే బాధ్యత . ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు సిద్ధం చేయించిన ట్రిపుల్యాన్ యూవీ కోటెడ్ జెండా ప్రస్తుతం హెచ్ఎండీఏకు చేరింది. ఎంత వేగంతో గాలులు వీచినా తట్టుకునే దృఢత్వం దీని ప్రత్యేకత. యూవీ కోటెడ్ కావడంతో రంగు వెలిసిపోదు. రెండు వైపులా లోగో ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది. ఏదైనా ప్రత్యేకత ఉన్న రోజున ఈ జెండాను ఎగురవేయాలని అధికారులు భావిస్తున్నారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







