గ్రేడ్ 12 స్టూడెంట్స్‌కి డ్రైవింగ్ లైసెన్స్?
- November 16, 2016
రస్ అల్ ఖైమా సెకెండరీ స్కూల్ గ్రేడ్ 12 విద్యార్థులు, డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో ఎమిరేట్స్‌లో పుట్టినవారికి వెసులుబాటు కల్పించాల్సిందిగా ట్రాఫిక్ పోలీస్ విభాగానికి విజ్ఞప్తి చేశారు. యూఏఈ వ్యాప్తంగా డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేవారికి మినిమమ్ వయసు 18 ఏళ్ళుగా నిర్ణయించబడింది. అయితే స్టూడెంట్స్ మాత్రం తమకు ఎగ్జంప్షన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు. అలర్ట్ పేరుతో పోలీసులు నిర్వహించిన ప్రోగ్రామ్ సందర్భంగా ఈ విజ్ఞప్తిని విద్యార్థులు పోలీసుల ముందుకు తీసుకొచ్చారు. లైసెన్స్ లేకుండా రోడ్లపై వాహనాలు నడుపుతున్నవారిలో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే విద్యార్థుల విజ్ఞప్తి నేపథ్యంలో డ్రైవింగ్ లైసెన్స్‌కి దరఖాస్తు చేసుకునే వయసుని 16 ఏళ్ళకు తగ్గించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. 16 ఏళ్ళు ఆ పైబడి వయసున్నవారికి ప్రత్యేక పరిస్థితుల్లో డ్రైవింగ్ లైసెన్స్ ఇస్తే మంచిదని గ్రేడ్ 12 స్టూడెంట్ ఖాలిద్ అల్ కాసిమి అభిప్రాయపడ్డాడు. ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు తీసుకుని వాహనాలు నడుపుతామని, తమ లాంటివారికి లైసెన్సులు ఇవ్వడం వల్ల నష్టమేమీ ఉండదని విద్యార్థులు అంటున్నారు. యువత వాహనాలు నడిపే విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్బంగా బ్రిగేడియర్ డాక్టర్ మొహమ్మద్ సయీద్ అల్ హుమైది చెప్పారు. రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నవారు, బాధితులు కూడా ఎక్కువగా యువతే ఉంటున్నారని అన్నారాయన.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







