ట్యాక్స్ హైక్ తప్పదేమో
- November 16, 2016
మనామా: ఈ ఏడాది 10 నుంచి 15 శాతం వరకు పన్నులు పెరగవచ్చునని ఓ ఎంపీ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది 300 డెసిషన్స్‌ని ప్రభుత్వం జారీ చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయనీ, వీటిల్లో కొత్త ఫీజులు, అలాగే ఉన్న ఫీజుల పెంపు వంటివి ఉన్నాయని ఎంపీ చెప్పారు. ఫైనాన్షియల్ అండ్ ఎకనమిక్ ఎఫైర్స్ కమిటీ డిప్యూటీ ఛైర్మన్ మొహమ్మద్ అల్ అహ్మద్ ఓ సందర్బంలో ఈ వివరాలు వెల్లడించారు. పార్లమెంటుతో సంబంధం లేకుండా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం పట్ల ఆయన ఆక్షేపణ వ్యక్తం చేశారు. ఇలాంటి నిర్ణయాలు బహ్రెయినీ సిటిజన్లకు ముందుగా ఇబ్బందులు కగజేస్తాయని చెప్పారాయన. పబ్లిక్ సర్వీస్ రుసుములు వచ్చే ఏడాది 10 నుంచి 15 వరకు పెరగవచ్చునని స్టడీస్ చెబుతున్నట్లు వివరించారు అల్ అహ్మద్. పాస్‌పోర్టులు, ఇమ్మిగ్రేషన్, జ్యుడీషియల్ సర్వీసులు, ఎలక్ట్రిసిటీ మరియు వాటర్, లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ సర్వీసెస్ వంటివి అదనపు భారం కాగలవని కమిటీ మెంబర్ అహ్మద్ కరాటా చెప్పారు. బహ్రెయినీల బారోయింగ్స్ 10శాతం పెరిగినట్లు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బహ్రెయిన్‌ని కోట్ చేస్తూ చెప్పారాయన.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







