ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన దివ్యమైన ఔషధంఆవాలు...
- November 17, 2016
వంటిట్లో ఆవాలుల లేని ఇళ్ళు తెలుగునాట ఉండదంటే అతిశయోక్తి కాదు. తాళింపు పెట్టాలంటే ఆవాలు ఉండాలి. ఆవాలు సువాసనా ద్రవ్యమే కాదు ఆరోగ్యాన్ని కాపాడే అద్భుతమైన దివ్యమైన ఔషధం. ముఖ్యంగా ఆవాలు స్త్రీలకు సంబంధించిన రోగాలలో, పలు సమస్యలతో అత్యద్భుతంగా పనిచేస్తుంది ఆవాలతో ఎన్నో ఉపయోగాలున్నా వాటిని కేవలం తాళింపుకే పరిమితం చేసే వాళ్లే ఎక్కువమంది ఆవాల గురించి అవగాహన లేకపోవడమే దీనికి కారణం.
ఆవాలలో రకాలు ఉన్నాయి. అవి తెల్ల ఆవాలు, ఎర్రావాలు, సన్న ఆవాలు, పెద్ద ఆవాలు అని ఆవాలు ఎలాంటివైనా వాటి ఔషధగుణాలలో పెద్దగా మార్పు ఉండదు. తెల్ల ఆవాలను కొన్ని రకాల జబ్బులలో ప్రత్యేకించి వాడతారు.
తెల్ల ఆవాలు స్త్రీలకు తరచుగా అయ్యే గర్భస్త్రావాన్ని అరికడతాయి. స్త్రీల మర్మాయవాలలో ఉండే క్రిములను చంపే గుణం తెల్ల ఆవాలకు ఉండదు.
స్త్రీలలో గర్భస్థ శిశువుకు కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. గర్భస్థ శిశువుకు హాని కలిగించే సూక్ష్మ క్రిముల్ని ఇవి నాశనం చేయగలవు. ఆవాలు వేచి చేసే గుణం కలవి. వేడి చేసే శరీరతత్వం ఉన్న వ్యక్తులు ఆవాల వినియోగం కాస్తం తక్కువగా చేసి మిగిలిన వారు తరచుగా ఆవాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
ప్రధానంగా కుష్టు వ్యాధితో బాధపడే వారికి ఆవాలు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. కుష్టువ్యాధిలో ఆవనూనెను పై పూతగా వ్రాస్తూ ఆవాలను నోటిలో ఔషధంగా తీసుకుంటే కుష్టు త్వరగా తగ్గుతుంది.
ఆయాసం, ఉబ్బసం వ్యాధిని ఆవాలు తగ్గిస్తాయి. రేచీకటి వ్యాధిలో కూడా ఆవాలు బాగా పనిచేస్తాయి. అయితే ఇతర నేత్రరోగాలలో, చత్వారమున్నప్పుడూ ఆవాలు నేత్రాలకు చెరుపు చేస్తాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండాలి.
తాజా వార్తలు
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి







