విక్రమ్ యువ దర్శకుడు విజయ్‌చందర్ తో....
- November 17, 2016
వైవిధ్య పాత్రలు దొరకాలేగానీ వాటికి జీవం పోయడానికి తన ప్రాణం పణంగా పెట్టడానికై నా సిద్ధపడే నటుడు విక్రమ్. ఇందుకు ఉదాహరణలు ఆయన సినీకెరీర్‌లో చాలా ఉన్నారుు. అరుుతే ఇటీవల సరైన విజయాలు లేక చాలా అసంతృప్తితో ఉన్న విక్రమ్‌కు ఇరుముగన్ చిత్ర విజయం ఫుల్ జోష్ అందించింది. అలాంటి నటుడి తదుపరి చిత్రం ఏమిటన్న ఆసక్తి సినీ అభిమానులందరికి కలగడం సహజమే. అరుుతే ఇరుముగన్ తరువాత విక్రమ్ నటించే చిత్రం గురించి చాలా ప్రచారం జరుగుతోంది. హరి దర్శకత్వంలో సామి-2 చిత్రం చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది. మరో పక్క కాదు విక్రమ్ ఆoగ్ల చిత్రం చేయనున్నారు.ఆ తరువాతే సామి-2 చిత్రం ఉంటుందని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఇలాంటి ప్రచారానికి తెరదించేలా విక్రమ్ తాజా చిత్రం గురించి వెల్లడించారు.విక్రమ్ యువ దర్శకుడు విజయ్‌చందర్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. విజయ్‌చందర్ ఇంతకు ముందు శింబు కథానాయకుడిగా వాలు చిత్రాన్ని తెరకెక్కించారన్నది గమ నార్హం. త్వరలో సెట్స్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని ఎస్ఎఫ్ఎఫ్ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇందులో విక్రమ్ ఇంతకుముందు పోషించనటువంటి విభిన్న కథా పాత్రలో నటించనున్నారని చిత్ర వర్గాలు తెలిపాయి. ఇందులో నటించే కథానాయకి, ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు వారు తెలిపారు
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







