మూవీ రివ్యూ : 'ఎక్కడికి పోతావు చిన్నవాడా'
- November 18, 2016
టైటిల్ :
ఎక్కడికి పోతావు చిన్నవాడా
జానర్ : రొమాంటిక్ థ్రిల్లర్
తారాగణం : నిఖిల్ సిద్ధార్థ్, నందితా శ్వేతా, హేబా పటేల్, వెన్నెల కిశోర్
సంగీతం : శేఖర్ చంద్ర
దర్శకత్వం : విఐ ఆనంద్
నిర్మాత : పి.వి. రావు
స్వామిరారా, కార్తీకేయ, సూర్య వర్సెస్ సూర్య లాంటి సినిమాలతో ట్రాక్ లోకి వచ్చినట్టుగానే కనిపించిన నిఖిల్, తరువాత శంకరాభరణం సినిమాతో నిరాశపరిచాడు. ఆ సినిమా ఫెయిల్యూర్ తో ఆలోచనలో పడ్డ ఈ యంగ్ హీరో రొటీన్ కమర్షియల్ జానర్ ను పక్కన పెట్టి మరోసారి తనకు బాగా కలిసొచ్చిన ప్రయోగానికే ఓటు వేశాడు.
రొమాంటిక్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఎక్కడికి పోతావు చిన్నవాడా, నిఖిల్ కెరీర్ ను తిరిగి ట్రాక్ లోకి తీసుకువచ్చిందా..?
కథ :
అర్జున్ (నిఖిల్ సిద్ధార్థ్) ఇంజనీరింగ్ స్టూడెంట్.. పరీక్షలు రాసిన వెంటనే తన ప్రేమించిన అమ్మాయి అయేషాను పెళ్లి చేసుకోవడానికి రిజిస్టర్ ఆఫీస్ కు వెళతాడు. కానీ ఎంత సేపు ఎదురుచూసినా అయేషా అక్కడికి రాదు. దీంతో అయేషా తనను మోసం చేసిందని, ఇంక జీవితంలో ఎవరికోసం ఇంతలా వెయిట్ చేయకూడదని నిర్ణయించుకుంటాడు. అయేషాను మరిపోయి కెరీర్ మీద దృష్టి పెట్టిన అర్జున్, గ్రాఫిక్ డిజైనర్ గా సెటిల్ అవుతాడు. అదే సమయంలో తన ఫ్రెండ్ అన్న కిశోర్( వెన్నెల కిశోర్) వింతగా ప్రవర్తిస్తుండటంతో అతడికి వైద్యం చేయించడానికి కేరళలోని మహిషాసుర మర్థని ఆలయానికి తీసుకెళతాడు.
ఆ సమయంలో విజయవాడ నుంచి తన అక్క వైద్యం కోసం వచ్చిన అమల అనే అమ్మాయి అర్జున్ కు పరిచయం అవుతుంది. మూడు రోజుల్లోనే ఇద్దరు దగ్గరవుతారు. తెల్లవారితే తన ప్రేమ విషయం చెప్తుంది అనుకున్న సమయంలో అమల అక్కడి నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోతుంది. ఆమెను వెత్తుకుంటూ విజయవాడ వెళ్లిన అర్జున్.. ఆమె చాలా ఏళ్ల కిందటే చనిపోయిందని తెలుసుకొని షాక్ అవుతాడు.
తరువాత తనకు కేరళలో కలిసి అమ్మాయి హైదరాబాద్ లో అర్జున్ కు కనిపిస్తుంది. అప్పుడే అసలు విషయం తెలుస్తుంది. తన అసలు పేరు నిత్య అని తనలోకి అమల అనే అమ్మాయి ఆత్మ ప్రవేశించటంతో కేరళలో వైద్యానికి తీసుకువెళ్లారని, అక్కడే తనకు పరిచయం అయ్యిందని అర్థం అవుతుంది. అదే సమయంతో మరోసారి అమల నుంచి అర్జున్ కు ఫోన్ వస్తుంది. నిన్ను కలవడానికి వస్తున్నాఅంటూ ఫోన్ చేసి చెపుతుంది అమల. అసలు అమల, అర్జున్ వెంటే ఎందుకు పడుతుంది..? నిఖిల్ ప్రేమించిన అయేషాకు ఏం అయ్యింది..? ఈ కథకు పార్వతికి సంబంధం ఏంటి..? చివరకు అమల ఆత్మ ఏమైంది..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
విభిన్న కథలను ఎంచుకొని సక్సెస్ సాధిస్తున్న హీరో నిఖిల్ సిద్ధార్ధ్ మరోసారి సక్సెస్ సాధించాడు. కాలేజ్ స్టూడెంట్, కెరీర్ లో సెటిల్ అయిన వ్యక్తిగా రెండు లుక్స్ లో మంచి వేరియేషన్ చూపించాడు. తన ప్రతీ సినిమాకు నటుడిగా మరో మెట్టు ఎదుగుతూ వస్తున్నాడు. తొలిసారిగా తెలుగు తెరకు పరిచయమైన నందితా శ్వేత మంచి నటన కనబరిచింది. ముఖ్యంగా హర్రర్ సన్నివేశాల్లో ఆమె నటన సూపర్బ్. హేబా పటేల్ మరోసారి అల్లరి పిల్లగా అలరించింది. నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా గ్లామర్ షోతో ఆకట్టుకుంది. అవికాఘోర్ పాత్ర సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. తెర మీద కనిపించేది కొద్దిసేపే అయినా.. తనదైన నటనతో మెప్పించింది అవికా. ఇతర పాత్రల్లో వెన్నెల కిశోర్, ప్రవీణ్, తనికెళ్ల భరణి తమ పరిది మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
టైగర్ సినిమాతో దర్శకుడిగా మారిన విఐ ఆనంద్ రెండో ప్రయత్నంలో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం సక్సెస్ ఫార్ములాగా మారిన కామెడీ హర్రర్ జానర్ నే నమ్ముకున్న ఎక్కడా రోటీన్ సినిమా అన్న ఫీలింగ్ కలగకుండా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ సినిమాను నడిపించాడు. కథా కథనాల విషయంలో ఆనంద్ తీసుకున్న కేర్ ప్రతీ సీన్ లోనూ కనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్ హైలెట్ సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫి. మహిషాసుర మర్థనీ ఆలయం, ఫస్ట్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ విజువల్ గా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర సంగీతం కూడా సినిమా మూడ్ కు తగ్గట్టుగా ఉంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
నందిత శ్వేత, నిఖిల్ నటన
స్క్రీన్ ప్లే
కామెడీ
మైనస్ పాయింట్స్ :
అన్ కన్విన్సింగ్ క్లైమాక్స్
అక్కడక్కడా స్లో నేరేషన్
ఓవరాల్ గా ఎక్కడికి పోతావు చిన్నవాడా.. మరోసారి నిఖిల్ కెరీర్ ను ట్రాక్ లోకి తీసుకొచ్చే కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ సినిమా
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







