ఎయిర్‌టెల్ మనీ బ్యాంకు వస్తోంది...!
- November 18, 2016
టెలికం రంగంలో సంచలనాలు నమోదు చేస్తున్న టెలికం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ ఇప్పుడు పేమెంట్ బ్యాంకింగ్ రంగంలోకి వస్తోంది. అతి త్వరలోనే పేమెంట్స్ బ్యాంకు సేవలను కష్టమర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ మేరకు ఆర్‌బిఐ నుంచి లైసెన్స్ కూడా సాధించింది. దేశంలో ఇలా లెసైన్స్ పొందిన మొట్టమొదటి కంపెనీ ఎయిర్‌టెల్ మాత్రమే.
Source:
పేమెంట్స్ బ్యాంకు సేవలను
పేమెంట్స్ బ్యాంకు సేవలను అందించేందుకు కోటక్ మహీంద్రా బ్యాంకుతో ఎయిర్‌టెల్ గతంలో చేతులు కలిపిన సంగతి అందరికీ తెలిసిందే.
ఎయిర్‌టెల్ అనుబంధ కంపెనీ
ఈ ఏడాది ఏప్రిల్లో ఎయిర్‌టెల్ అనుబంధ కంపెనీ అయిన ఎయిర్‌టెల్ ఎం-కామర్స్ సర్వీసెస్ (ఏఎంఎస్ఎల్) ఆర్‌బిఐ నుంచి లైసెన్స్ దక్కించుకున్నప్పటికీ ప్రారంభతేదీ మాత్రం వాయిదా పడుతూనే ఉంది.
ఈ పనులు వేగవంతం
అయితే ఇప్పుడు ఈ పనులు వేగవంతం అవుతున్నాయని డిసెంబర్ నుంచి పూర్తి స్తాయి సేవలు ప్రారంభించే అవకాశం ఉందని ఎయిర్‌టెల్ అధికారులు చెబుతున్నారు.
పేమెంట్ బ్యాంకు ద్వారా
ఈ పేమెంట్ బ్యాంకు ద్వారా కష్టమర్లు సేవింగ్స్, డిపాజిట్లు, పేమెంట్, అలాగే చెల్లింపులు లాంటి సేవలను ఆఫర్ చేస్తారు. కష్టమర్లు రూ. లక్ష వరకు ఈ బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు.
మారుమూల పల్లెల్లో ఉన్న లక్షలాది మందికి
ఈ బ్యాంకుల ప్రధాన ఉద్దేశం.. మారుమూల పల్లెల్లో ఉన్న లక్షలాది మందికి ఆర్థికపరమైన సేవలు అందించడమే. దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌కు 26 కోట్లకుపైగా మొబైల్ చందాదారులు ఉన్నారు. 15 లక్షలకుపైగా కేంద్రాల ద్వారా ఎయిర్‌టెల్ తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది.
ఆర్థికపరమైన సేవలను
వీరంతా ఈబ్యాంకులను ఉపయోగించుకోవడం ద్వారా ఆర్థికపరమైన సేవలను అందిపుచ్చుకుంటారని కంపెనీ చెబుతోంది. దీంతో పాటు కొత్త కష్టమర్లను కూడా దక్కించుకునే అవకాశం ఉందని కంపెనీ అంచనా వేస్తోంది.
ఎయిర్‌టెల్ మనీ
2011 నుంచి ఎయిర్‌టెల్ మనీ సేవలు అందిస్తున్న ఏఎంఎస్ఎల్ పేరును ఈ ఏడాది మే నెలలో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంకుగా మార్చారు. ఇప్పుడు ఇదే కొటాక్ మహీంద్రాతో కలిసి వినియోగదారులకు సేవలను అందిచనుంది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







