పెర్మియన్లో భారీ చమురు నిల్వలను గుర్తించిన యూఎస్జీఎస్ ....
- November 18, 2016
అమెరికాలో అతిపెద్ద చమురు క్షేత్రంగా పశ్చిమ టెక్సాస్‌లోని పెర్మియన్ బేసిన్‌ను 'అమెరికా భూవిజ్ఞాన అధ్యయన సంస్థ(యూఎస్జీఎస్)' గుర్తించింది. దేశంలో ఏ ఇతర చమురు క్షేత్రంలో లేనిస్థాయిలో అత్యంత భారీగా చమురు నిల్వలు అందులో ఉన్నాయని పేర్కొంది. పెర్మియన్ బేసిన్‌లోని వూల్ఫ్క్యాంప్ ప్రాంతంలో 1980ల నుంచి చమురు వెలికితీత పనులు జరుగుతున్నాయి. అయితే, ఈ ప్రాంతంలో ఉన్న చమురు నిల్వల స్థాయిపై ఇప్పటివరకు స్పష్టత లేదు. దీంతో నిల్వలు ఎంతమొత్తంలో ఉన్నాయో తేల్చేందుకుగాను యూఎస్జీఎస్ ఇటీవల ప్రత్యేక అధ్యయనం చేపట్టింది.
వూల్ఫ్క్యాంప్ ప్రాంతంలోని మిడ్‌లాండ్ బేసిన్లో 2000 కోట్ల బ్యారెళ్ల చమురు, 160 కోట్ల బ్యారెళ్ల సహజవాయువు నిల్వలు ఉన్నట్లు అందులో తేలింది. దీంతో అమెరికాలో ఇప్పటి వరకు వెలుగుచూసిన చమురు క్షేత్రాల్లో ఇదే అత్యంత పెద్దదని యూఎస్జీఎస్ అనధికారికంగా పేర్కొంది. ఉత్తర డకోటాలో గుర్తించిన నిల్వలతో పోలిస్తే.. పెర్మియన్ బేసిన్లో నిల్వలు మూడు రెట్లు అధికమని సూచించింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత సాయంతో ఈ నిల్వలను పూర్తిస్థాయిలో వెలికితీయొచ్చని యూఎస్జీఎస్ నిపుణులు అభిప్రాయపడ్డారు. లబ్బక్, మిడ్‌లాండ్ నగరాల్లో 118 మైళ్ల మేరకు పెర్మియన్ బేసిన్ విస్తరించి ఉంది. ఇక్కడ పూర్తిస్థాయిలో చమురు ఉత్పత్తి పనులు జరిగితే.. చమురు ధరలు భారీగా తగ్గే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం







