ఆటతోపాటే వివాదాలతోనూ గుత్తాజ్వాల....
- November 18, 2016
ఆటతోపాటే వివాదాలతోనూ మీడియాకెక్కుతుంటుంది బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తాజ్వాల. తాజాగా ఒలింపిక్స్‌లో పతకం సాధించిన సింధు గురించి, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ గురించి జ్వాల మాట్లాడింది. సింధుకు, సానియాకు దొరికిన సపోర్ట్ తనకు దక్కలేదని జ్వాల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 'ఇప్పటి వరకు నేను ప్రభుత్వాన్ని డబ్బులు అడగలేదు. ఎలాంటి అవార్డులనూ ఆశించలేదు. మొన్న సింధు ఒలింపిక్ పతకం గెలిచాక 'వాళ్ల కుటుంబం అంత కష్టపడింది. వాళ్ల నాన్నగారు ఎన్నో త్యాగాలు చేశారు' అంటున్నారు. సింధు వాళ్ల కుటుంబం కష్టపడింది. అందులో డౌట్ లేదు. అయితే ఓ క్రీడాకారుడి కుటుంబ సభ్యులు ఎవరైనా అంతే కష్టపడతారు. కానీ సింధుకి దొరికిన సపోర్ట్ నాకెక్కడిది.సానియాకు కూడా సపోర్ట్ దొరికింది. ఇలాంటివి మాట్లాడకూడదు. నేను ఫేమస్ అయ్యానంటే అది కేవలం నా ఆటతోనే. నాకెవరూ సపోర్ట్ చేయలేద'ని చెప్పుకొచ్చింది జ్వాల. అలాగే బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ డబుల్స్‌ను సపోర్ట్ చేయరని, అంతే తప్ప అతనితో తనకెలాంటి ఇబ్బందులూ లేవని తెలిపింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







