ఉల్ఫా ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు
- November 19, 2016
అసోంలో ఉల్ఫా ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. టిన్సుకియా జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఆర్మీ జవాన్ల వాహనం లక్ష్యంగా ఐఈడీ పేలుడు జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో నలుగురు గాయపడ్డారు. కాగా పెంగ్రీ ప్రాంతంలో ఈరోజు తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ అధికారి సునీత్ న్యూటన్ తెలిపారు.ఉగ్రవాదులు ముందుగా పేలుడుకు పాల్పడి అనంతరం జవాన్లపై కాల్పులు జరిపినట్లు వెల్లడించారు. గాయపడిన జవాన్లను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. ఈ చర్యను అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తీవ్రంగా ఖండించారు. అధికారులను టిన్సుకియా పంపిస్తున్నట్లు వెల్లడించారు.మరోవైపు ఈ సంఘటనపై ఆర్మీ ఈస్ట్రన్ కమాండ్ కూడా ట్విట్టర్ ద్వారా ధ్రువీకరించింది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







