అన్నపూర్ణ స్టూడియోస్ లో రాజ్ తరుణ్ రెండో సినిమా..
- November 19, 2016
సీనియర్ హీరో నాగార్జున, దర్శకులను సాంకేతిక నిపుణులను మాత్రమే కాదు.. ఇటీవల తన బ్యానర్ లో హీరోలను కూడా పరిచయం చేస్తున్నాడు. అలా నాగ్ బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా పరిచయం అయిన యంగ్ హీరో రాజ్ తరుణ్. ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయం అయిన రాజ్ తరుణ్. ఆ సినిమా సమయంలోనే అదే బ్యానర్ లో మరో సినిమా చేయడానికి అంగీకరించాడు. అయితే ఇన్నాళ్లు సరైన కథ దొరక్క ఆ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ వచ్చింది.
తాజాగా రాజ్ తరుణ్, అన్నపూర్ణ స్టూడియోస్ లో తన రెండో సినిమాకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో రంజని అనే మహిళా దర్శకురాలు ఇండస్ట్రీకి పరిచయం అవుతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతున్న ఈ సినిమా డిసెంబర్ 1న లాంచనంగా ప్రారంభించనున్నారు.
రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న రాజుగాడు సినిమా రిలీజ్ కు రెడీ అవ్వగా, అందగాడు, కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







