దేశంలోని ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఉప ఎన్నికలు..
- November 19, 2016
దేశంలోని ఆరు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో.. 9 అసెంబ్లీ, నాలుగు పార్లమెంటు స్థానాలకు ఉప ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే పోలింగ్ సెంటర్ల దగ్గరకు చేరుకున్న ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే బైపోల్స్ పై పెద్ద నోట్లు రద్దు ప్రభావం తీవ్రంగా ఉంది. చిల్లర సమస్యలతో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకోలేకపోతున్నారు. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, త్రిపురతోపాటూ పుదుచ్చేరిలో కూడా ఒక అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. తమిళనాడులో మూడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న బైపోల్స్ లో అన్నాడీఎంకే, డీఎంకే పోటీపడుతున్నాయి. ఈ ఎన్నికల ఫలితాలను 22న లెక్కిస్తారు. పెద్ద నోట్ల రద్దుతో ఓటింగ్ శాతం తక్కువగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి..
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







