కాకరకాయలో ఔషధగుణాలు...
- November 26, 2016
కాకర పాదురూపలో ప్రతి ఇంటి పెరట్లోనూ ఆంధ్రదేశపు పల్లెలలో కనిపిస్తుంది. ఈ చెట్టుకు ప్రత్యేకమైన పోషణ అవసరం లేదు. కాకరకాయ పండితే చిక్కని నారింజ రంగులో తినెయ్యాలనే కోరిక కలిగేట్లు ఉంటుంది. పచ్చి కాకరకాయ పనరువాసన వస్తుంది. అయితే కాస్తంత నోట్లో పెట్టుకుంటే భరించలేనంత చేదుగా ఉంటుంది. చాలామంది కాకరకాయలోని ఈ చేదును గమనించే దగ్గరకు రానీయరు. కానీ కాకరకు ఎన్నో ఔసధగుణాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో దీనిని కారవేల్లికా అని అంటారు.
కాకరకాయలు, ఆకులు క్రిమిసంహారులు, జ్వరహరములు. జీర్ణశక్తిని పెంచే గుణం కలవి. షుగర్ వ్యాధిని తగ్గిస్తాయి. ఇంకా అనేక ఇతర ఉపయోగాలు కూడా కాకర వల్ల సమకూరుతాయి. అరికాళ్ళ మంటలు ఉన్నప్పుడు కాకర ఆకుల్ని చేతితో నలిపి పిండితతే రసం వస్తుంది. ఈ రసాన్ని అరికాళ్లు రాస్తుంటే మంట తగ్గిపోతుంది.
రోజుకొక పచ్చి కాకరకకాయను తింటుంటే ఉబ్బసం తగ్గుతుంది. రోజు రోజూ గుణం కనబడుతుంది. తగ్గే వరకూ విడవకుండా వాడాలి. ఏలికపాములు పోవాలంటే కాకర గింజల చూర్ణం నీటితో లేక తేనెతో లోనికి తీసుకోవాలి. రెండు లేక మూడుసార్లు తీసుకుంటే ఏలిక పాములు పోతాయి.
శరీరంలో నొప్పులు ఉన్నప్పుడు అన్ని నొప్పులూ రోజుకొక పచ్చి కాకరకాయను తింటుంతే తగ్గిపోతాయి. కాకరకాయను పూర్తిగా ఒక్కసారి తినలేనప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్క ముక్క చొప్పున తినవచ్చు. కుక్కకాటుకు కాకరను మందుగా వాడతారు. కుక్క కరిచినప్పుడు కాకరకాయను తినిపించి కరిచిన చోట గాయాన్ని కడిగిన తర్వాత కాకర ఆకుల్ని పిండి ఆ రసాన్ని గాయంపైన రాస్తారు. కొందరు కాకర ఆకుల్ని కట్టుకడతారు.
రోజుకొక పచ్చి కాకరకాయను తింటుంటే కొంతత కాలానికి అన్ని రకాల కుష్టు వ్యాధులు పోతాయి. రోజూ పచ్చి కాకరకాయ తినలేకపోతే కాకరకాయను కూరగా పండుకుని అయినా తినవచ్చు. చాలా కాలం తినవలసి ఉంటుంది. దీని వల్ల నిదానంగా అయినా తగ్గుతుంది.
కాకరకాయను మెత్తగానూరి మందంగా ఒక శుభ్రమైన గుడ్డపైన వేసి గడ్డలపైన వేసి కట్టు కడితే తగ్గుతాయి. లేదా కట్టు కట్టకపోయినా మందంగా పట్టు వేస్తూ ఉన్నా సరిపోతుంది. రోజూ కొంత కాకరకాయ తింటుంటే గొంతు రొంప పోతుంది.
కాకరకాయ రసాన్ని తరచూ పుక్కిలిస్తూ ఉంటే నోట్లో పుళ్ళు, నాలుక పూత తగ్గుతాయి. రక్తలేమి(అనీమియా) కు పూటకు ఒక చెంచా కాకరాకు రసం తాగితే కడుపులో ఉండే హానికారక క్రిములు నాశనం అయి తరువాత రక్తవృద్థి జరుగుతుంది. రోజూ కాకరకాయను వాడుతూ ఉంటే మధుమేహం అదుపులో ఉంటుంది. కాకరకాయ కూరను భోజనంలో కొంచెంగా తింటూ ఉంటే సుఖ విరేచనం అవుతుంది.
ఆకరాయకు వేడిచేసే గుణం ఉంది. కాబట్టి కాస్తంత జాగ్రత్తగా వాడుకోవాలి. కాకరాకు రసా్ని రోజూ కంటి చుట్టూ కనురెప్పలకు రాస్తుంటే క్రమేపీ రేచీకటి తగ్గుతుంది. కాకరకాయ చేదుపోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. ఉప్పుతో కాకరకాయను కడగడం వల్ల మజ్జిగలో కాకరకాయ ముక్కలను నానబెట్టడం వల్ల కాకరకాయలోని చేదు తగ్గుతుంది. అయితే చేదును పూర్తిగా తొలగిస్తే కాకరకాయలోని ఔషదగుణాలు తగ్గవచ్చు. కాకరకాయ పూర్తి ఔషధగుణాలతో ఉండాలంటే ప్రకృతి సిద్ధంగా దానికి ఉన్న చేదు ఉండాల్సిందే.
తాజా వార్తలు
- సౌదీలో ఇంటి వద్ద వైద్య సేవలకూ ఆరోగ్య బీమా వర్తింపు..!
- ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే.. 60 రోజుల పాటు డెలివరీ వాహనాలు సీజ్..!
- వర్షాకాలానికి ముందస్తు జాగ్రత్తలు తీసుకోండిని.. ప్రజలకు అష్ఘల్ సూచన..!!
- బహ్రెయిన్‌లో ప్రవాసుల వైద్య రుసుముల సవరణకు యోచన..!!
- ఒమన్‌లో సముద్ర తాబేళ్ల సంరక్షణకు ప్రత్యేక చర్యలు..!!
- దుబాయ్‌లో అక్టోబర్ 19 నుంచి ఉచిత వైద్య పరీక్షలు..!!
- మధ్యప్రాచ్యంలోనే తొలిసారిగా అంతరిక్షానికి బయోలాజికల్ శాంపిల్స్..!!
- రియాద్‌లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్‌ఫ్లిక్స్‌లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్







