విదేశీ వనితపై అత్యాచారo.....
- November 27, 2016
విహారయాత్ర కోసం కేరళకు వచ్చిన విదేశీ వనితపై ఓ యువకుడు అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తీవ్రరక్తస్త్రావం కావడంతో స్పృహతప్పి పడిపోయిన ఆమెను కొందరు గుర్తించి ఆసుపత్రిలో చేర్పించారు. కేరళ రాజధాని తిరువనంతపురం శివారు కోవళంలో చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జపాన్ కు చెందిన 35 ఏళ్ల మహిళ శుక్రవారం ఉదయం కేరళకు వచ్చి, కోవళంలోని ఓ హోటల్ గదిలో దిగింది. అదే రోజు రాత్రి ఆమె అత్యాచారానికి గురైంది. రక్తస్త్రావం కావడంతో స్పృహతప్పి అచేతనంగా పడిఉన్న ఆమెను హోటల్ సిబ్బంది గుర్తించి, స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.బాధితురాలి ఫిర్యాదుమేరకు నిందితుడి కోసం గాలింపు చేపట్టిన పోలీసులు చివరికి కోవళం ప్రాంతంలోనే తేజ(25) అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు తేజ కుటుంబం కోవళంలో హ్యాండీక్రాఫ్ట్స్(హస్తకళల) దుకాణాన్ని నడుపుకొంటున్నదని, వీరు కర్ణాటక నుంచి కేరళకు వలస వచ్చారని పోలీసులు చెప్పారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 376ను అనుసరించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







