మరోసారి థమన్, మహేష్ బాబు సినిమా...
- November 28, 2016
సూపర్ స్టార్ మహేష్ బాబు, తన సినిమాలకు ఎప్పుడు సాంకేతిక నిపుణులుగా ఒకే టీంను కంటిన్యూ చేస్తుంటాడు. అప్పటికే స్టార్ ఇమేజ్ ఉన్న టెక్నిషియన్స్ తోనే కలిసి పనిచేసేందుకు ఇష్టపడే మహేష్, ఎక్కువగా తన సినిమాలకు మణిశర్మతో మ్యూజిక్ చేయించుకున్నాడు. ఆ తరువాత దేవీ శ్రీ ప్రసాద్ టాప్ పొజిషన్ కు రావటంతో తనతో మ్యూజిక్ చేయించుకున్నాడు. కానీ థమన్ విషయంలో మాత్రం ముందే స్పందించాడు. తమన్ కెరీర్ స్టార్టింగ్ లోనే దూకుడు సినిమా ఇచ్చిన మహేష్, తరువాత బిజినెస్ మేన్, ఆగడు సినిమాలకు కూడా థమన్ తో కలిసి పనిచేశాడు.అయితే తాజాగా మరోసారి థమన్, మహేష్ బాబు సినిమాకు సంగీతం అందిస్తున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించిన థమన్, ఏ సినిమాకు మహేష్ తో కలిసి పనిచేయబోయేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుతం మహేష్, మురుగదాస్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమాకు హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. ఆ తరువాత కొరటాల శివ దర్శకత్వంలో చేయబోయే సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత పీవీపీ బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు మహేష్. అయితే ఈ సినిమాకు మలయాళ సంగీత దర్శకుడు గోపిసుందర్ మ్యూజిక్ చేస్తాడన్న టాక్ వినిపిస్తోంది. అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. ప్రస్తుతం ప్రకటించిన సినిమాలకు సంగీత దర్శకుడు దాదాపుగా ఫిక్స్ అయిపోయారు, మరి థమన్ సంగీతం అందించే సినిమా ఎవరితో ఉంటుందో చూడాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







