రోడ్లను బాగుచేసేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్న మినిస్ట్రీ
- November 28, 2016
మనామా: భారీ వర్షాల కారణంగా రోడ్లపై నిలిచిపోయిన నీటిని తొలగించేందుకు మినిస్ట్రీ 24 గంటలూ సహాయక చర్యల్ని కొనసాగిస్తోంది. ముహర్రాక్ మునిసిపాలిటీ, ముంపు ప్రాంతాల్లో కనీ వినీ ఎరుగని రీతిలో సహాయక కార్యక్రమాల్ని కొనసాగిస్తున్నారు. రోడ్లను పొడిగా ఉంచేందుకు, అలాగే క్లీన్‌గా మార్చేందుకు ఇరవై నాలుగ్గంటలూ పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వచ్చే ప్రతి కంప్లయింట్నీ సునిశితంగా పరిశీలించి, సమస్యను పరిష్కరించేందుకు పనిచేస్తున్నట్లు వారు వివరించారు. శుక్రవారం సాయంత్రం నుంచి మునిసిపాలిటీ 174 నోటిఫికేషన్లను అందుకుంది. ప్రధానంగా ముహర్రాక్ గవర్నరేట్ పరిధిలో పరిస్థితి తీవ్రంగా ఉందని అధికారులు చెప్పారు. సోషల్ మీడియాలో వీటికి సంబంధించి పలు వీడియోలు, ఫొటోలు దర్శనమిస్తున్నాయి. వాటి ఆధారంగా కూడా సహాయక చర్యల్ని చేపట్టారు అధికారులు. ట్విట్టర్, ఇన్‌స్టగ్రామ్‌లో ముహర్రాక్ మునిగిపోతోంది అనే పేరుతో కామెంట్స్, పోస్టింగ్స్ ట్రెండింగ్‌గా మారాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







