అవాంతరాలు లేకుండా మస్కట్ మున్సిపాలిటీ వెబ్ పేజీ మార్పు
- November 28, 2016
మస్కట్ మున్సిపాలిటీ యొక్క వెబ్ పేజీ త్వరలో అవాంతరం లేని విధంగా మార్పు జరగనుంది. ఏ మొబైల్ పరికరం మీద సందర్శించడంతో పాటు అది ఏ స్క్రీన్ పరిమాణం స్వీకరించే విధంగా ఆ వెబ్సైట్ పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా రూపొందించింది.ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ డైరెక్టరేట్ మస్కట్ మున్సిపాలిటీ సీనియర్ ఇ-సర్వీసెస్ నిపుణుడు నిహద్ జుమ అల్ బెలుషి " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, మా వెబ్సైట్ ఏ పరికరంతో అనుకూలంగా చేయడానికి పునరాకృతి చేశామని అన్నారు. అది ఒక వ్యక్తిగత కంప్యూటర్, ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్, ఒక టాబ్లెట్. ఏదైనా అయినా ఇందుకు సరిపోతుందని ఆయన తెలిపారు. ప్రజలు చాలా మంది ఈ రోజుల్లో మొబైల్ పరికరాల ద్వారా వెబ్సైట్లకు అనుసంధానం కాబడుతున్నారు. వారు ఇంటర్ నెట్ కేంద్రాల వద్దకు వెళ్లడం లేదా ఇంటి వద్ద కూర్చొని తమ వ్యక్తిగత కంప్యూటర్ లో ఒక వెబ్సైట్ కు అనుసంధానం కాబడేందుకు వారికి సమయం లేదు. దీనితో వెబ్సైట్ పరికరాలు అంతటా అనుకూలత లేదు కనుక దీనితో చూసేవారు తక్కువగా ఉన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







