ప్రముఖ దర్శకుడు బాల సమర్పణలో `కాళి`
- November 28, 2016
ప్రముఖ దర్శకుడు బాల తమిళంలో నిర్మించిన `చండివీరన్` తెలుగులో `కాళి` అనే పేరుతో అనువాదమవుతోంది. బి స్టూడియోస్ పతాకంపై ప్రముఖ దర్శకుడు బాల తెలుగులో సమర్పిస్తున్నారు. అధర్వ, ఆనంది, లాల్ కీలక పాత్రల్లో నటించారు. శర్కునమ్ దర్శకత్వం వహించారు. లక్ష్మీ వెంకటేశ్వర మూవీస్, శ్రీ గ్రీన్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎం.ఎం.ఆర్. ఈ చిత్రాన్ని తెలుగులో అందిస్తున్నారు.
నిర్మాత ఎం.ఎం.ఆర్ మాట్లాడుతూ ``ఫక్తు పల్లెటూరి చిత్రమిది. నీటి కోసం రెండు ఊర్ల మధ్య జరిగిన పోరాటం ఇందులో ఉంటుంది. సంక్రాంతి సంబరాల నుంచి, పల్లెటూరి సరసాలు, సరదాల వరకు అన్నీ ఇందులో ఉన్నాయి. తొలి సగం ఆద్యంతం కడుపుబ్బ నవ్విస్తుంది. రెండో సగం ఉత్కంఠభరితంగా సాగుతుంది. సన్నివేశాల మూడ్‌కు అనుగుణంగా సాగే పి.జి.ముత్తయ్య కెమెరా పనితనం మెప్పిస్తుంది. సామాజిక స్పృహతో సాగే చిత్రమిది. అనువాద పనులు దాదాపు పూర్తయ్యాయి. అరుణగిరి అందించిన బాణీలు తప్పకుండా అందరికీ నచ్చుతాయి. సబేష్ - మురళి నేపథ్య సంగీతం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది. అధర్వ, ఆనంది మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఈ స్క్రిప్ట్ నచ్చి తమిళంలో ఈ చిత్రాన్ని బాల నిర్మించారు. తెలుగులో ఆయన సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. తెలుగు వారికి కూడా తప్పకుండా కనెక్ట్ అయ్యే సినిమా ఇది. డిసెంబర్ లో పాటలను, చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం`` అని అన్నారు. రాజశ్రీ, బోస్ వెంకట్, ఎన్. ఎలాంపర్తి, రవిచంద్రన్, శాంతకుమారి, కె.అనంతన్, అనంత పంగాలి, కలై, మదురై రమేవ్, జి.కె కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.జి.ముత్తయ్య, సంగీతం: ఎస్.ఎన్.అరుణగిరి, నేపథ్య సంగీతం: సబేష్ మురళి, మాటలు: ఎం.రాజశేఖర్ రెడ్డి, పాటలు: భువనచంద్ర, శివగణేశ్, డా.చల్లా భాగ్యలక్ష్మి, ఆర్ట్: ఎ.ఆర్. మోహన్, ఎడిటింగ్: ఎ.రాజా మొహమ్మద్, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఎ.శర్కునమ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: రఘు, నిర్మాత: ఎం.ఎం.ఆర్.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్‌సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







