దుబాయ్‌లో బ్యాడ్ డెబిట్స్: అరెస్టయ్యే ప్రమాదముంది జాగ్రత్త!
- November 28, 2016
ఒకప్పుడు దుబాయ్‌లో వివిధ కారణాలతో అప్పులపాలయ్యారా? ఆ కారణంగా మీ మీద కేసులు నమోదయ్యాయా? తిరిగి దుబాయ్ వెళ్లాలనే ఆలోచనతో ఉన్నారా? అయితే జాగ్రత్త. దుబాయ్ మీదుగా విదేశాలకు వెళ్ళాలనుకున్నాసరే, అక్కడ కాస్సేపు ఆగాల్సి వస్తే మీరు అరెస్టయ్యే ప్రమాదముంది. 2009 సమయంలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో చాలామంది దుబాయ్‌లో అప్పులపాలై, తమ తమ స్వదేశాలకు వెళ్ళిపోయారు, అప్పులు తీర్చకుండానే. అలాంటివారిపై కేసులు నమోదై ఉంటే, తిరిగి వారు దుబాయ్‌లో అడుగు పెట్టాల్సి వస్తే వెంటనే వారిని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అయితే అరెస్టుల నుంచి తప్పించుకోవడానికి కొన్ని మార్గాలున్నాయి. ఆ మార్గాలేమిటంటే, ముందుగా మీ మీద కేసు నమోదైందో లేదో తెలుసుకోవాలి. కేసు నమోదు అయి ఉంటే, మీరు ఎవరికి అయితే అప్పులున్నారో, ఆ అప్పులకు సంబంధించి వ్యవహారాల్ని చక్కబెట్టుకునే ఏర్పాట్లు చేసుకోవాలి. ఓ వ్యక్తిని దుబాయ్‌లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా, ఆ అప్పుల నుంచి కొంత మినహాయింపు కూడా కోరవచ్చు. పరిస్థితులకు అనుగుణంగా పెనాల్టీలను రద్దు చేసి, తద్వారా చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించి మీకు వారు చూపిస్తారు. దాన్ని క్లియర్ చేసుకుంటే, ఎలాంటి అరెస్టులూ లేకుండా దుబాయ్ వెళ్ళడానికి మీకు అవకాశం ఉంటుంది. అప్పుల్ని సెటిల్ చేసుకోడానికి మీరు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిని కూడా ఎంచుకోవచ్చు. అయితే బ్యాంకుకీ మీకూ మధ్య అవగాహన సరిగ్గా ఉండాలి. స్వచ్ఛందంగా మీరే సరెండర్ అయిపోవాలనుకున్నా, అందుకు దుబాయ్ పోలీసులు అవకావం కల్పిస్తారు. అయితే అన్ని ఏర్పాట్లతోనూ రావడం మర్చిపోకూడదు.
తాజా వార్తలు
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్రౌండర్.. !
- కువైట్లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!







