క్యూలైన్ల నుంచి విముక్తి: దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎమిరేట్స్ ఐడి
- November 28, 2016
దుబాయ్ ఇంటర్నేషనల్ విమానాశ్రయం ఇమ్మిగ్రేషన్‌కి సంబంధించి ఆటోమేటెడ్ గేట్స్ ద్వారా ప్రయాణించేందుకు ఎమిరేట్స్ ఐడీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ విధానం ద్వారా క్యూలైన్ల సమస్య తప్పుతుంది. 234,000 మంది యూఏఈ రెసిడెంట్స్, ఈ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్నారు. ముందస్తు రిజిస్ట్రేషన్ లేకుండా పూర్తి ఉచితంగా ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి మూడు టెర్మినల్స్‌లో మొత్తం 12 స్మార్ట్ గేట్స్ వద్ద వీటిద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎమిరేట్స్ ఐడీ కార్డ్‌ని ఇన్‌సెర్ట్ చేయగానే, అందులో అమర్చబడిన సిస్టమ్ వేగంగా, ఖచ్చితంగా, సమర్థవంతంగా ఐడెంటిటీని కన్‌ఫామ్ చేస్తుంది. దేశంలోకి ఎంట్రీ అవడం, దేశం నుంచి బయటకు వెళ్ళడం వంటివన్నీ చకచకా జరిగిపోతాయి. దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ సిఇఓ పాల్ గ్రిఫిత్స్ మాట్లాడుతూ, 10 నుంచి 15 సెకెన్ల యావరేజ్ ట్రాన్సాక్షన్ టైమ్‌తో ప్రయాణాన్ని స్మార్ట్‌గా మార్చుకోవచ్చని తెలిపారు. ఇమ్మిగ్రేషన్ ప్రాసెస్‌ని చాలా వేగవంతం చేయడానికి ఈ ప్రక్రియ దోహదపడ్తోందని చెప్పారాయన. కొత్త సాంకేతికను అందిపుచ్చుకోవడం ద్వారా 2023 నాటికి ఎయిర్‌పోర్ట్ కెపాసిటీని 118 బిలియన్‌కి పెంచనున్నట్లు వివరించారు పాల్ గ్రిఫిత్.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







