మెనా టెలికామ్: టాప్ స్పీడ్, ఎక్స్‌ప్లోజివ్ డౌన్లోడ్స్
- November 28, 2016
మనామా: మెనా బిజినెస్ కస్టమర్స్ ఇకపై 1.25టెరాబైట్స్ డౌన్లోడ్ కెపాసిటీని పొందే అవకాశం ఉంది. కంపెనీ ఈ మేరకు ఓ ప్రకటనలో వెల్లడించింది. హైస్పీడ్తోపాటు నమ్మకమైన సేవలు అందించే తమ సంస్థ, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా సరికొత్త ప్యాకేజీలను అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. వినియోగదారులు తమ నెంబర్ని అలాగే ఉంచుకుంటూ మెనా టెలికామ్‌కి మారవచ్చనీ, ఉచితంగా 77IIIIIII రేంజ్ నెంబర్ని కూడా పొందే వీలుందని సంస్థ ప్రతినిథులు తెలిపారు. మెనా టెలికామ్, తన సొంత ఫైబర్ లింక్‌ని బహ్రెయిన్ వ్యాప్తంగా కలిగి ఉంది. మైకోవేవ్, 4జి ఎల్‌టికి వైమాక్స్ వంటివి మెనా ప్రత్యేకతలు. అన్ని రకాల వ్యాపార అవసరాలకూ సరిపడే ప్యాకేజీలతో మెనా టెలికామ్ సేవలు అందిస్తోంది. బ్యాంకులకు సెక్యూర్ విపిఎన్, రిమోట్ సర్వైలెన్స్సిస్టమ్స్, సిసిటివి సొల్యూషన్స్, పిబిఎక్స్ సిస్టమ్స్ వంటివి మెనా టెలికామ్ ప్రత్యేకతలు.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







