జమ్మూ కాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
- November 29, 2016
జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. బోర్డర్‌లో ఆర్మీపై దాడులకు తెగబడుతూ... బోర్డర్ దాటి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం టెర్రరిస్టుల ప్రయత్నాలను తిప్పికొట్టింది. ఎదురు దాడికి దిగుతూ ముష్కర మూకల్ని పరుగులు పెట్టించింది. కాసేపు భారత బలగాలకు-ఉగ్రవాదులకు మధ్య బీకర యుద్ధం జరిగింది. రెండుచోట్ల జరిగిన ఎన్‌కౌంటర్లలో ఏడుగుర్ని సైన్యం మట్టుబెట్టింది.
జమ్మూకి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగ్రోటా ప్రాంతంలో ఆర్మీ క్యాంపుపై ముందుగా కాల్పులు జరిపారు. గ్రనైడ్లతో దాడులకు దిగారు. ఈ ఘటనలో ఓ జవాను గాయపడ్డారు. నిమిషాల్లోనే సైన్యం అలర్టయ్యింది. కౌంటర్‌గా ఫైరింగ్‌కు దిగడంతో... టెర్రరిస్టులు పక్కనే ఉన్న భవనాల్లో నక్కారు. వెంటనే చుట్టు పక్కల ఉన్న ఇళ్లు, స్కూళ్లు ఖాళీ చేయించి వారిని చుట్టుముట్టారు. బలగాల కాల్పుల్లో నలుగరు తీవ్రవాదులు హతమయ్యారు. అయితే ఉగ్రవాదుల దాడుల్లో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు.
మరోవైపు సాంబా సెక్టార్‌లోని రాంఘడ్‌లో ఉగ్రవాదులు చొరబడి కాల్పులు జరిపారు. వీరి కాల్పులను ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమవ్వగా... ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ముందస్తు జాగ్రత్తగా జమ్మూ-శ్రీనగర్ హైవేను మూసివేసి తనిఖీలు ముమ్మరం చేశారు. అలాగే బోర్డర్ వెంట భద్రతను పెంచి... అదనపు బలగాలను మోహరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







