సీనియర్ నిర్మాతల శ్రేయోభిలాషి ఆర్.సత్తిరాజు మృతి
- November 29, 2016
సీనియర్ నటి వాణిశ్రీకి గాడ్‌ఫాదర్, రామానాయుడు వంటి సీనియర్ నిర్మాతల శ్రేయోభిలాషి ఆర్.సత్తిరాజు (82) కన్నుమూశారు. చెన్నైలోని ఆయన స్వగృహంలో సోమవారం రాత్రి గుండెపోటుకి గురై తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య కాంతమ్మ (వాణిశ్రీ సోదరి), కుమారులు ఆర్‌ఎస్‌ఎన్ మూర్తి, ఆర్.మురళీకృష్ణ ఉన్నారు. కుమార్తె చాముండేశ్వరి అనారోగ్యంతో నాలుగేళ్ల క్రితం మరణించారు.సత్తిరాజు స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకు. స్వతహాగా చిత్రకారుడైన ఆయన ఆర్ట్ టీచర్‌గా చెన్నైకి వచ్చారు. అనంతరం సినీ పరిచయాలు పెరిగాయి. అప్పుడే ఇండస్ర్టీలో నిలదొక్కుకుంటున్న వాణిశ్రీకి అండగా నిలిచి, ఆమె కెరీర్‌ని అత్యున్నత స్థాయికి చేర్చడంలో విశేష కృషి చేశారు.
దివంగత ముఖ్యమంత్రి వెంగళ్‌రావు హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా కూడా వ్యవహరించారు. అందరికీ ఆప్తులుగా, అజాత శత్రువుగా మెలిగిన సత్తిరాజు మరణంపై చెన్నైలోని సినీ, తెలుగు ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేశారు. వాణిశ్రీ అశ్రునయనాలతో తన గాడ్‌ఫాదర్‌కు నివాళులర్పించారు. కాగా, మంగళవారం మధ్యాహ్నం నుంగంబాక్కం శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







