తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త
- November 29, 2016
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. వచ్చే నెల 1న ఉద్యోగులకు జీతంలో 10 వేల రూపాయలు నగదు చేతికిచ్చేందుకు భారతీయ రిజర్వు బ్యాంకు అంగీకరించింది. దేశమంతా నోట్ల కష్టాలతో అల్లాడుతున్న నేపథ్యంలో ఆర్బీఐ నిర్ణయం తెలంగాణ ఉద్యోగులకు ఊరట కలిగించనుంది.
పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో బ్యాంకులు, ఏటీఎంలలో నగదు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఎక్కడ చూసిన 'నో క్యాష్' బోర్డులు దర్శమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని ప్రభుత్వం ద్వారా ఉద్యోగ సంఘాలు ఆర్బీఐకి విజ్ఞప్తి చేశాయి.
మరోవైపు సర్కారు బ్యాంకుల్లో ఉద్యోగులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, ఏ బ్యాంకు బ్రాంచీకి వెళ్లినా డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







