తారక్ తో నాని మల్టీస్టారర్ సినిమా
- November 30, 2016
టాలీవుడ్ లో ఇప్పుడు మల్టీస్టారర్ మూవీస్ ఊపందుకున్నాయి. వెంకటేష్- మహేష్ బాబు కలసి చేసిన ' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' హిట్ కావడంతో టాలీవుడ్ లో కూడా మల్టీస్టారర్ మూవీలు చేయొచ్చని ప్రూవ్ అయ్యింది. ఆ తరువాత మళ్ళీ వెంకటేష్ ..పవన్ కళ్యాణ్ కలసి చేసిన ' గోపాల గోపాల ' కూడా హిట్ అయ్యింది. దాంతో చాలామంది డైరెక్టర్లు మల్టీస్టారర్ కథలు రెడీ చేసే పనిలో పడ్డారు.లేటెస్ట్ న్యూస్ ఏంటంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఓ మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నాడట.
జనతా గ్యారేజ్ తరువాత ఎటువంటి మూవీ చేయాలా అని తారక్ చాలా కథలు వింటున్నాడు. అలా తారక్ కి కథ చెప్పిన వారిలో హను రాఘవపూడి కూడా వున్నాడు . అయితే హను చెప్పింది సోలో హీరో స్టోరీ కాదట. మల్టీస్టారర్ మూవీ అట.
హను రాఘవపూడి చెప్పిన స్టోరీ కి ఇంప్రెస్ అయిన తారక్ మల్టీస్టారర్ కి రెడీ అన్నాడని టాక్. అంతేకాదు మరో హీరోగా నాని అయితే బాగుంటుందని సజెస్ట్ చేసాడట తారక్. కాబట్టి త్వరలోనే టాలీవుడ్ లో మరో మల్టీస్టారర్ మూవీ రాబోతోందన్నమాట.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







