గ్యాస్‌కు మజ్జిగ మంచిది
- November 30, 2016
మసాలా దినుసులు తింటున్నారా? అయితే తప్పకుండా మజ్జిగ తాగండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మజ్జిగలోని లాక్టిక్ ఆసిడ్ కడుపులోని గ్యాస్‌కు కల్లెం వేస్తుంది. ఆయుర్వేద ప్రకారం గ్యాస్‌కు మజ్జిగ మంచిది. మసాలా దినుసులతో చేసిన ఆహారం తిన్నప్పుడు మజ్జిగ తీసుకోవడం మరవొద్దు. మసాలా దినుసులు తీసుకున్నాక మజ్జిగను సేవించడం ద్వారా ఎసిడిటీని దూరం చేసుకోవచ్చు. అలాగే గ్యాస్‌కు ఉపశమనంతో పాటు శరీరానికి వెంటనే శక్తి లభించాలంటే కొబ్బరి నీళ్లు తాగాల్సిందే. అలాగే బెల్లం వల్ల గ్యాస్ ఎంతగానో తగ్గుతుంది. బెల్లంలోని మెగ్నీషియం ఎంతో మేలు చేస్తుంది. కాల్షియం కూడా లభిస్తుంది. ఇకపోతే.. ఒక కప్పు నీటిని మరిగించి.. అందులో ఒక టేబుల్‌స్పూన్ సోంపు వేసి కాసేపు అలాగే ఉంచండి. ఆ పాత్రకు మూత పెట్టి రాత్రంతా అలాగే ఉండనివ్వండి. ఆ నీటిలోకి ఒక టేబుల్‌స్పూను తేనె కలుపుకుని తాగండి. ఇలా రోజుకు మూడుపూటలా తాగితే ఎసిడిటీకి పరిష్కారం లభించినట్లేనని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. పచ్చటి తులసి ఆకుల్ని వేడి నీటిలో మరగనివ్వండి. కాసేపయ్యాక చల్లారిన తరువాత ఆ నీటిని సేవించండి. రోజూ ఇలా చేస్తే వారం పది రోజుల్లో గ్యాస్ కొంతవరకైనా తగ్గుతుందని వారు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







