క్యారెట్ పాయసం
- November 30, 2016
కావలసినవి: క్యారెట్ తురుము (పొట్టు తీసి, కడిగి, తురమాలి) - మూడు కప్పులు, పాలు - ఐదుకప్పులు, పంచదార - ఆరు టేబుల్ స్పూన్లు, నెయ్యి - రెండు టీస్పూన్లు, జీడిపప్పులు - 12, ఎండుద్రాక్షలు - ఒక టేబుల్ స్పూన్, బాదం - ఆరు, యాలకల పొడి - అరటీస్పూన్.
తయారీ: బాదం గింజల్ని పలుకులుగా కోయాలి. ఒక పాన్‌లో నెయ్యి వేడిచేసి జీడిపప్పు, బాదం పలుకులు వేసి లేత గోధుమరంగు వచ్చే వరకు వేగించాలి. తరువాత అందులోనే ఎండుద్రాక్షలు వేసి 20 సెకన్లు వేగించాలి. లేదా ఎండుద్రాక్షలు ఉబ్బేవరకు వేగించి అన్నింటినీ తీసి పక్కన పెట్టాలి. మరో పాన్‌లో పాలు పోసి వేడిచేసి మంట తగ్గించి అవసరమైనంత చిక్కగా వచ్చే వరకు ఉంచాలి. డ్రైఫ్రూట్స్ వేగించిన పాన్‌లోనే క్యారెట్ తురుము వేసి ఓ మాదిరి మంట మీద క్యారెట్ మెత్తబడేవరకు ఉంచాలి. అందుకు ఐదు నుంచి ఏడు నిమిషాల సమయం పడుతుంది. మధ్యమధ్యలో గరిటెతో కలుపుతుండాలి. తరువాత అరకప్పు పాలుపోసి కలిపి మూతపెట్టి సన్నటి మంటమీద ఎనిమిది నిమిషాలు లేదా క్యారెట్ ఉడికే వరకు ఉంచాలి. ఈ మిశ్రమం చల్లారాక 3/4 వంతు భాగాన్ని గుజ్జులా గ్రైండ్ చేయాలి. ఇలా చేసేటప్పుడు నీళ్లు అస్సలు వాడకూడదు. అవసరమయితే ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ల పాలు కలపాలి. ఉడికించిన క్యారెట్‌లో మిగతా పావు భాగంలో క్యారెట్ గుజ్జు వేసి బాగా కలపాలి. సన్నటి మంట మీద మరో ఐదు నిమిషాలు ఉంచాలి. ఇందులో పంచదార వేసి కలిపి ఐదు నిమిషాల తరువాత నట్స్, యాలకలపొడి వేసి కలపాలి. సన్నటి మంట మీద నాలుగు నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేయాలి. తినడం వేడిగా, చల్లగా మీ ఇష్టం. కావాలనుకుంటే క్యారెట్ తురుము మొత్తాన్ని గ్రైండ్ చేయొచ్చు. నాలుగు టేబుల్ స్పూన్ల కండెన్స్డ్ మిల్క్ కలుపుకుంటే పంచదార వేయొద్దు. ఎక్కువ మొత్తంలో తయారు చేస్తుంటే క్యారెట్‌ని ముక్కలు చేసి నాలుగైదు నిమిషాలు ఉడికించి గుజ్జు చేసుకోవచ్చు.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







