మహేశ్ సినిమా శాటిలైట్ హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు...
- December 01, 2016
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు హీరోగా ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న చిత్రం శాటిలైట్ హక్కులు భారీ స్థాయిలో అమ్ముడు పోయాయట. చిత్రం షూటింగ్ పూర్తి కాకముందే శాటిలైట్ హక్కులు రూ. 26 కోట్లకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ అహ్మదాబాద్‌లో జరుగుతోంది. ఈ నెల 18 వరకు అక్కడే చిత్రీకరణ కొనసాగనుంది. జనవరి 1న చిత్రం టైటిల్‌ని, 26న రిపబ్లిక్ డే సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. వేసవిలో చిత్రాన్ని విడుదల చేయడానికి ప్రయత్నిస్తున్నారు. .రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో దర్శకుడు ఎస్.జె.సూర్య ప్రతినాయకుడిగా తొలిసారి తెరపై కనిపించనున్నారు. మహేశ్ ఇంటెలిజెన్స్ అధికారిగా సరికొత్త లుక్‌లో కనిపిస్తారని సమాచారం. ఎన్వీ ప్రసాద్, ఠాగూర్ మధు ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. హారిస్ జయరాజ్ స్వరాలు సమకూరుస్తున్నారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







