'కమ్మ కాపు..' అనే సాంగ్‌ని తొలగిస్తున్నట్లు రామ్‌గోపాల్ వర్మ...
- December 02, 2016
వర్మ మూవీ 'వంగవీటి' రిలీజ్‌కు అడ్డంకులు తొలిగిపోయాయి. ఇందులోని'కమ్మ కాపు..' అనే సాంగ్‌ని తొలగిస్తున్నట్లు డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ స్పష్టంచేశాడు. కొందరి సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వర్మ తన ట్వీట్లో తెలిపాడు. భావోద్వేగాలతో కూడిన చిత్రమని, ఎవర్నీ అప్రతిష్ఠపాలు చేయదని వివరణ ఇచ్చుకున్నాడు. విజయవాడలో జరిగిన ఫ్యాక్షన్ రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో 'వంగవీటి' సినిమా రానుంది.
వాస్తవాలకు విరుద్ధంగా సినిమా చిత్రీకరిస్తున్నారంటూ వంగవీటి మోహనరంగా కొడుకు రాధాకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌ను తొలగిస్తామని దర్శకుడు కోర్టుకు హామీ ఇవ్వడంతో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.
ఇక శనివారం ఆడియో ఫంక్షన్ విజయవాడలోని కేఎల్ విశ్వవిద్యాలయ గ్రౌండ్ లో జరగనుంది. అంతా ఓకే అయితే ఈనెల 23న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







