ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు కొత్త ఆఫర్
- December 02, 2016
ఇండిగో ఎయిర్ లైన్స్ ప్రయాణికులకు కొత్త ఆఫర్ ప్రకటించింది. టికెట్ ధరను రూ.799 నుంచి ప్రారంభిస్తూ 2016 డిసెంబర్ 14- 2017 అక్టోబర్ 28 మధ్య ప్రయాణించే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. అయితే ఈ రోజు రాత్రిలోపల టికెట్లు బుక్ చేసుకునే వారికి మాత్రమే ఆఫర్ వర్తిస్తుందని సంస్థ ప్రకటనలో తెలిపింది. కొచ్చి-తిరువనంతపురం, కోయంబత్తూర్-చెన్నై మధ్య టికెట్టు ధర రూ.799, బెంగళూరు-హైదరాబాద్ మధ్య టికెట్టు రూ.999, దిల్లీ-జైపూర్ మధ్య రూ.1,041గా సంస్థ ప్రకటించింది.మరో వైపు జెట్ ఎయిర్వేస్ కూడా ఇయర్ ఎండ్ సేల్‌లో భాగంగా రూ.899లకే టికెట్లు అందిస్తోంది.2016 డిసెంబర్ 14 తర్వాత ప్రయాణించే వారు 15 రోజుల ముందు టికెట్టు బుక్ చేసుకోవాలని తెలిపింది.
స్పైస్‌జెట్ స్పైసీ ఆఫర్
స్పైస్‌జెట్ కూడా ఈ వరసలో చేరింది. కొన్ని ఎంచుకున్న మార్గాల్లో 2017 జనవరి 9 నుంచి అక్టోబర్ 28 మధ్య ప్రయాణించే వారికి రూ.737కే టికెట్టు ధర ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ కూడా ఈరోజు అర్ధరాత్రితో ముగుస్తుందని సంస్థ ప్రకటించింది.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







