పెసరకోవా హల్వా
- December 02, 2016
కావల్సినవి: పెసరపప ఒక కప్పు, పాలు ఒక కప్పు, చక్కెర ఒకటింపావు కప్పు, యాలకులపొడి అరటీస్పూను, పచ్చికోవా అరకప్పు కుంకుమ పువ్వు కొద్దిగా, నెయ్యి ఆరు టేబుల్‌స్పూన్లు, ఆల్మండ్లు పిస్తా పప్పులు రెండు టేబుల్ స్పూన్లు (చిన్న ముక్కలుగా కోసుకోవాలి)
తయారుచేసే విధానం:
పెసరపప్పును మూడుగంటలసేపు నానబెట్టాక నీళ్లు వడగట్టి. మరీ మెత్తగా కాకుండా రుబ్బి పెట్టుకోండి. నీళ్లు బాగా తక్కువ వాడాలి. ఒక టేబుల్ స్పూను గోరువెచ్చటి పాలలో కుంకుమ పువ్వు కరగపెట్టి పక్కన ఉంచుకోండి.
వెడల్పాటి నాన్‌స్టిక్ పాన్‌లో నెయ్యి వేసి కరిగాక పెసరపిండి వేసి సన్నసెగ మీద ఆపకుండా తిప్పుతూ ఉండండి. బంగారు రంగు వచ్చాక పచ్చికోవా వేసి మరికాసేపు తిప్పండి. మిగిలిన పాలు, ఒక కప్పు నీళ్లు (రెండూ గోరువెచ్చగా ఉండాలి) పోసి అవన్నీ ఆవిరయ్యేదాకా తిప్పుతూనే ఉండండి. ఇప్పుడు కుంకుమ పువ్వు, యాలకుల పొడి వేసి మరోసారి కలిపి ఆల్మండ్, పిస్తా పప్పుల ముక్కలతో అలంకరించి వడ్డించండి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







